ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ వ్యాక్సిన్‌పై అపోహలు విడనాడాలి

ABN, First Publish Date - 2021-04-11T05:07:00+05:30

కొవిడ్‌ వ్యాక్సిన్‌పై అపోహలు విడనాడాలని కొవ్వూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బావన రత్నకుమారి అన్నారు.

కొవ్వూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌కు వ్యాక్సిన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొవ్వూరు, ఏప్రిల్‌ 10: కొవిడ్‌ వ్యాక్సిన్‌పై అపోహలు విడనాడాలని కొవ్వూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బావన రత్నకుమారి అన్నారు. కొవ్వూరులో చైర్‌పర్సన్‌ రత్నకుమారి మొదటివిడత వ్యాక్సిన్‌ శనివారం వేయించుకున్నారు. కొవిడ్‌ విస్తరించే పరిస్థితులు ఉన్నాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండా లని ఆమె సూచించారు. ప్రతిఒక్కరూ ముందు జాగ్రత్తగా వ్యాక్సిన్‌ వేయించుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. బయటకు వెళ్లే సమయంలో ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించడం, చేతులు శానిటైజర్‌తో శుభ్రపరచుకోవడం, భౌతిక దూరం పాటించాలన్నారు. కార్యక్రమంలో బావన రాజేష్‌, సలాది సందీప్‌కుమార్‌, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.


వ్యాక్సిన్‌పై పెరుగుతున్న అవగాహన

బుట్టాయగూడెం: కొవిడ్‌ వ్యాక్సిన్‌పై అంతగా శ్రద్ధ చూపని జనం క్రమేపీ ఆసక్తి కనబరుస్తున్నారు. వ్యాక్సిన్‌ కోసం క్యూ కడుతున్నారు. టీకా కావా లంటూ ఆసుపత్రులకు వస్తున్నారు. అడవులనే నమ్ముకుని జీవనం సాగి స్తున్న కొండరెడ్లు కూడా కొవిడ్‌ వ్యాక్సిన్‌ కోసం కొండలు దిగి అడవులు దాటి ఆసుపత్రులకు వస్తున్నారు. పందిరిమామిడిగూడెం పాఠశాల ఆవరణలో అంతర్వేదిగూడెం పీహెచ్‌సీ వైద్యాధికారి సుధాకర్‌ ఆధ్వర్యంలో శనివారం వ్యాక్సిన్‌ వేశారు. చుట్టుపక్కల గ్రామాలకు చెందిన కొండరెడ్లు టీకా కోసం క్యూ కట్టారు. మొదట్లో ముందుకురాని గిరిజనులు ప్రజాసంఘాలు వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించడంతో అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. వ్యాక్సిన్‌ వేయించుకోవాలని బతిమాలిన ససేమిరా అన్నా జనాలు టీకా కోసం ముందుకు రావడంతో అధికారులు వ్యాక్సిన్‌ ఇస్తున్నారు.

Updated Date - 2021-04-11T05:07:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising