ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాస్క్‌, గ్లౌజ్‌ లేకుండా పనిచేయలేం

ABN, First Publish Date - 2021-05-25T04:54:06+05:30

మాస్క్‌లు, గ్లౌజ్‌లు లేకుండా విధులు నిర్వహించ లేమని ఆశా వర్కర్లు ఆందోళన వ్యక్తం చేశారు.

కొవ్వూరులో ఆశ కార్యకర్తల నిరసన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆశ వర్కర్ల నిరసన


కొవ్వూరు, మే 24 : మాస్క్‌లు, గ్లౌజ్‌లు లేకుండా విధులు నిర్వహించ లేమని ఆశా వర్కర్లు ఆందోళన వ్యక్తం చేశారు. రక్షణ పరికరాలు అందించి రూ.50 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించాలని సీఐటీయూ కార్యదర్శి ఎం.సుం దర్‌బాబు అన్నారు. కొవ్వూరు మున్సిపల్‌ కార్యాలయం వద్ద సోమవారం  నిరసన ప్రదర్శన నిర్వహించారు. సుందర్‌బాబు మాట్లాడుతూ ఆశా కార్యక ర్తలను ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా గుర్తించాలన్నారు. ఆశా వర్కర్లకు రెండు వే ల ప్రత్యేక అలవెన్సు రాష్ట్రంలో అమలు కావడం లేదన్నారు. ఆశా కార్యకర్త లు అంజలీ కుమారి, లక్ష్మీ భ్రమరాంబిక, సత్యవతి, భారతి, పాల్గొన్నారు.


దేవరపల్లి: ఆశా వర్కర్లందరికి మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజులు ఇవ్వాలని సీఐటీయూ మండల కార్యదర్శి ఎస్‌.భగత్‌ డిమాండ్‌ చేశారు. దేవ రపల్లి పీహెచ్‌సీ వద్ద ఆశా వర్కర్లు ఒక రోజు సమ్మె కార్యక్రమంలో భాగం గా ధర్నా నిర్వహించారు. భగత్‌ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పని చేస్తున్న ఆశావర్కర్లకు రక్షణ సౌకర్యాలు లేవని విమర్శించారు. ఆశా వర్కర్ల యూ నియన్‌ నాయకురాలు వెంకటలక్ష్మి మాట్లాడుతూ తమపై పనిభారం పెరిగిందని ఒత్తిడికి లోనవుతున్నారన్నారు. ఆశా వర్కర్లందరికి గ్రూపు ఇన్సూరెన్స్‌ సౌకర్యాన్ని వర్తింప చేయాలన్నారు. కార్యక్రమంలో చంద్రవతి, ప్రసన్న, మరియమ్మ, ఎం.హసీన, స్వర్ణ పాల్గొన్నారు.


చాగల్లు : మండలంలోని ఆశ వర్కర్లు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. మూడు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల వద్ద ఆశలు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నినాదాలు చేసారు. ఆశ వర్కర్లు యూనియన్‌ నాయకురాలు కె.పోశమ్మ మాట్లాడుతూ విధి నిర్వహణలో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.50 లక్షలు బీమా మొత్తం అందించాలన్నారు. విధి నిర్వహణకు అవసరమైన పరికరాలు అందజేయాలని కోరారు. ఆశ వర్కర్లు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-25T04:54:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising