ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

త్వరలో సమగ్ర శిక్షా ఏపీసీ నియామకం

ABN, First Publish Date - 2021-06-21T06:31:33+05:30

పాలనాధికారి లేకపోవడంతో అస్తవ్యస్తంగా తయారైన సమగ్ర శిక్షా జిల్లా ప్రాజెక్టుకు అడిషనల్‌ ప్రాజెక్టు కో–ఆర్డినేటర్‌ (ఏపీసీ)ని నియమించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

త్వరలో సమగ్ర శిక్షా ఏపీసీ నియామకం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు ఎడ్యుకేషన్‌, జూన్‌ 20: పాలనాధికారి లేకపోవడంతో అస్తవ్యస్తంగా తయారైన సమగ్ర శిక్షా జిల్లా ప్రాజెక్టుకు అడిషనల్‌ ప్రాజెక్టు కో–ఆర్డినేటర్‌ (ఏపీసీ)ని నియమించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.  నిబంధనల ప్రకారం విద్యాశాఖకు చెందిన అధికారిని సమగ్ర శిక్షా ఏపీసీగా నియమించడానికి ప్రభుత్వం గతంలోనే నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు త్రిసభ్య కమిటీని కూడా నియమించింది. అయితే ఏపీసీ పోస్టుకు దరఖాస్తు చేసుకున్న ఇద్దరూ విద్యాశాఖకు చెందిన వారు కాకపోవడంతో సమగ్ర శిక్షాలోనే డిప్యూటీ డైరెక్టర్‌ హోదాలో పనిచేస్తున్న వారిలో ఒకరిని నియమించే అవకాశాలు ఉన్నాయి. నాడు–నేడు రెండో దశ పనులు జూలై ఒకటవ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఆ లోగానే ఎస్‌ఎస్‌ఎ జిల్లా ప్రాజెక్టుకు నూతన ఏపీసీ నియామకం జరగనుందని తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏడు జిల్లాల్లో ఏపీసీలకు స్థానచలనం ఉందని ఆ మేరకు జరిగే నూతన ఏపీసీల నియామకాల్లో భాగంగా జి ల్లాకు కూడా నియమిస్తారని సమాచారం.


Updated Date - 2021-06-21T06:31:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising