ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పశు వైద్యానికి నియోజకవర్గానికో అంబులెన్స్‌

ABN, First Publish Date - 2021-07-26T06:25:23+05:30

పశువైద్యానికి నియోజకవర్గా నికో అంబులెన్స్‌ ఏర్పాటుకు ప్రణా ళిక సిద్ధం చేస్తున్నట్టు పశుసంవర్ధక శాఖ మంత్రి సిదిరి అప్పలరాజు పేర్కొన్నారు.

మాట్లాడుతున్న మంత్రి అప్పలరాజు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాడేపల్లిగూడెం రూరల్‌, జూలై 25: పశువైద్యానికి నియోజకవర్గా నికో అంబులెన్స్‌  ఏర్పాటుకు ప్రణా ళిక సిద్ధం చేస్తున్నట్టు పశుసంవర్ధక శాఖ మంత్రి సిదిరి అప్పలరాజు పేర్కొన్నారు.  వెంకట్రామన్న గూడెం ఉద్యాన వర్సిటీ ఆవరణలోని గేదెల పరిశోధనా స్థానంలో ఆదివారం ఎమ్మెల్యే కొట్టు  అధ్యక్షతన రూ.4.40 కోట్లతో నిర్మించిన నూతన కార్యాలయం, కోళ్లు, గొర్రెల షెడ్డు, రైతుల వసతి గృహాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ అమూల్‌ పాలవెల్లువ ద్వారా రైతులకు లీటరుకు రూ.70 చెల్లిస్తున్నామని, అధిక పాల దిగుబడి వచ్చేందుకు ముర్రా జాతి గేదెలపై పరిశోధ నలకు అధికంగా నిధులు కేటాయిస్తున్నామన్నారు. మంత్రులు చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, తానేటి వనిత, ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం, డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ వర్సిటీ ఉప కులపతులు డాక్టర్‌ వి.పద్మనాభ రెడ్డి, డాక్టర్‌ టి జానకి రామ్‌, ఎమ్మెల్సీ మోషేన్‌రాజు మాట్లాడారు. అనంతరం కరపత్రాలను ఆవిష్కరించి రైతులకు పశుగ్రాసం పంపిణీ చేశారు.  పరిశోధనా సంచాలకులు కె. సంజనరావు, డాక్టర్‌ ఆర్‌వీఎస్‌కే రెడ్డి, గేదెల పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-26T06:25:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising