ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డాక్టర్‌ అంబేడ్కర్‌కు ఘన నివాళి

ABN, First Publish Date - 2021-12-07T06:02:04+05:30

చింతలపాటి బాపిరాజు స్మారక ఉన్నత పాఠశాలలో అల్లూరి సీతారామరాజు భగత్‌సింగ్‌ సేవా విజ్ఞాన కేంద్రం కన్వీనర్‌ వి. రాధాకృష్ణ ఆధ్వర్యంలో హెచ్‌ఎం బి.శ్రీనివాసరావు అధ్యక్షతన అంబేడ్కర్‌ చిత్ర పటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు.

భీమవరం అంబేడ్కర్‌ సెంటర్‌లో గంటా సుందర్‌కుమార్‌ నివాళి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాడవాడలా వర్ధంతి కార్యక్రమాలు

విగ్రహాలు, చిత్రపటాల వద్ద నాయకుల నివాళులు 

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ వర్ధంతి సోమవారం నిర్వహించారు. పలు రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, దళిత సంఘాల, వామపక్షాల ఆధ్వర్వంలో అంబేడ్కర్‌ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. 


భీమవరం ఎడ్యుకేషన్‌/అర్బన్‌, డిసెంబరు 6 : చింతలపాటి బాపిరాజు స్మారక ఉన్నత పాఠశాలలో అల్లూరి సీతారామరాజు భగత్‌సింగ్‌ సేవా విజ్ఞాన కేంద్రం కన్వీనర్‌ వి. రాధాకృష్ణ ఆధ్వర్యంలో హెచ్‌ఎం బి.శ్రీనివాసరావు అధ్యక్షతన అంబేడ్కర్‌ చిత్ర పటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. డీఎన్నార్‌ కళాశాలలో అధ్యక్ష కార్యదర్శులు గోకరాజు నరసింహరాజు, గాదిరాజు సత్యనారాయణరాజు ఆధ్వర్యంలో, మండల పరిషత్‌ కార్యాలయం లో ఎంపీపీ పేరిచర్ల విజయనరసింహరాజు ఆధ్వర్యంలో డాక్టర్‌ అంబేడ్కర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివా ళులర్పించారు. పట్టణంలోని అంబేడ్కర్‌ సెంటర్‌లో దళిత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు గంటా సుందర్‌కుమార్‌ అం బేడ్కర్‌ విగ్రహం వద్ద నివాళులు అర్పించారు.  

 పాలకొల్లు అర్బన్‌ :డాక్టర్‌ అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగాన్ని వైసీపీ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని ఎమ్మెల్సీ అంగర రామమోహన్‌ విమర్శించారు. గాంధీ బొమ్మల సెంటర్‌లో అంబేడ్కర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. టీడీపీ మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కర్నేన రోజా రమణి, నాయకులు కర్నేన గౌరునాయుడు, పెచ్చెట్టి బాబు, బొణం నాని, మహ్మద్‌ జానీ తదితరులు పాల్గొన్నారు. బీఎస్‌పీ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఉన్నమట్ల కపర్ధి, బీజేపీ కార్యాల యంలో జక్కంపూడి కుమార్‌, కొల్లి కొండప్రసాడ్‌, కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షుడు యడ్ల శివాజీ, షేక్‌ మహబూబ్‌ బాషా, కొలుకులూరి అర్జునరావు, తదితరులు గాంధీ బొమ్మల సెంటర్‌లో వున్న అంబేడ్కర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. రాహుల్‌ సేవా సంస్థ, తహసీల్దార్‌ కార్యాలయం వద్ద, ఏఎస్‌ఎన్‌ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంబేడ్కర్‌ చిత్రపటాలకు నివాళులర్పించారు.

పాలకొల్లు రూరల్‌ : ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ చిట్టూరి కనకలక్ష్మి అంబేడ్కర్‌ చిత్రపటానికి పూల మాల వేసి నివాళుర్పించారు. ఎంపీడీవో వెంకటేశ్వరావు, ఎంపీ టీసీ ఏడుకొండలు, సిబ్బది పాల్గొన్నారు. 

యలమంచిలి : ఆర్యాపేట, యలమంచిలి గ్రామాల్లో అంబేడ్కర్‌ వర్ధంతి కార్యక్రమాల్లో నక్కా గిరి, జీవన్‌ బాబు, మానుకొండ సోమరాజు, తాడి శశిధర్‌, మోకా నరసింహారావు, దళిత యువకులు పాల్గొన్నారు.

ఆకివీడు : ఆకివీడు బస్టాండ్‌ సెంటర్‌, పెదపేటలలో వున్న అంబేడ్కర్‌ విగ్రహాలకు వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి గోకరాజు రామరాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఏఎంసీ, నగర పంచాయతీ కమిషనర్లు ఎండీ మస్తాన్‌వలీ, జామి హైమావతి, వైస్‌ చైర్మన్‌ వంగా జోత్స్న, ఏఎంసీ మాజీ చైర్మన్‌ మోటుపల్లి గంగాధరరావు,  కౌన్సిలర్లు ఉన్నారు.

Updated Date - 2021-12-07T06:02:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising