ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరిశుభ్రత లోపించడం వల్లే నులి పురుగులు

ABN, First Publish Date - 2021-03-04T04:52:59+05:30

వ్యకిగత పరిశుభ్రత లోపించడం వలనే పిల్లల్లో నులిపరుగులు ఏర్పడతాయని పీహెచ్‌సీ వైద్యురాలు మెహారున్నీసాబేగం అన్నారు.

ఆకివీడులో విద్యార్థులకు మాత్రలు వేస్తున్న వైద్య సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆకివీడు, మార్చి 3: వ్యకిగత పరిశుభ్రత లోపించడం వలనే పిల్లల్లో నులిపరుగులు ఏర్పడతాయని పీహెచ్‌సీ వైద్యురాలు మెహారున్నీసాబేగం అన్నారు. ఏడాది నుంచి 19 ఏళ్ల పిల్లలకు ఆల్బెండజోల్‌ మాత్రలు బుధవారం వేశారు. కలుషిత ఆహారం తినడం, బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జనతో నులి పురుగులు ఏర్పడతాయన్నారు. ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు శుభ్రమైన నీటిలో కడిగి తినాలన్నారు. వేలి గోర్లు, ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అల్బెండజోల్‌ మాత్రలు ఆరు నెలలకోకసారి వేసుకోవాలన్నారు. ఏఎన్‌ఎం స్వరాజ్యం, ఆశా వర్కర్స్‌ తదితరులు పాల్గొన్నారు.


సిద్ధాపురం (ఆకివీడు రూరల్‌): సిద్ధాపురం జడ్పీ, ప్రాఽథమిక పాఠశాల విద్యార్థులకు ఆల్బెండజోల్‌ మాత్రలు వేసినట్లు గ్రామ సచివాలయ ఏఎన్‌ఎం వరలక్ష్మి తెలిపారు. పిల్లలకు ఈమాత్రలు వేయడంతో నులి పురుగులు నివారణతో ఆరోగ్యంగా ఉంటారని ఆమె తెలిపారు.


పాలకోడేరు: విద్యార్థులకు వైద్య సిబ్బంది నులిపురుగుల మాత్రలు వేశారని పీహెచ్‌సీ వైద్యధికారి శివరంజని తెలిపారు. విద్యార్థులకు చేతులు శుభ్ర పరుచుకునే విధానం వివరించారు. అనంతరం నులి పురుగుల మాత్రలను 97 శాతం అందించడం జరిగిందని తెలిపారు.

Updated Date - 2021-03-04T04:52:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising