ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులకు పరిహారం చెల్లింపునకు కృషి చేస్తా

ABN, First Publish Date - 2021-09-29T05:38:52+05:30

వరదలకు నష్టపోయిన ప్రతీ రైతుకు ప్రభుత్వం తరపున పరిహారం అందించేలా కృషిచేస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్‌ సీహెచ్‌ అరుణ్‌కుమార్‌ పేర్కొన్నారు.

రైతులతో మాట్లాడుతున్న వ్యవసాయ శాఖ కమిషనర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాడేపల్లిగూడెం రూరల్‌, సెప్టెంబర్‌ 28: వరదలకు నష్టపోయిన ప్రతీ రైతుకు ప్రభుత్వం తరపున పరిహారం అందించేలా కృషిచేస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్‌ సీహెచ్‌ అరుణ్‌కుమార్‌ పేర్కొన్నారు. వరదలకు నీటమునిగిన వరిచేలను మాధవరం, జగన్నాథపురం గ్రామాల్లో వరిచేలను ఆయన మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు వారి గోడును ఆయన ముందు వెళ్ళబోసుకున్నారు. వరి పంట వారం పదిరోజుల్లో చేతికి వచ్చే తరుణంలో ఇలా వరి నీటమునకకు గురైందని దీని ప్రభావంతో తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎర్రకాల్వ గట్లు పటిష్టం చేయాలని ప్రతీ ఏటా చిన్నపాటి వరద వచ్చినా పంట మొత్తం నష్టపోతున్నామని వాపోయారు. దీనిపై కమిషనర్‌ అరుణ్‌కుమార్‌ మాట్లాడుతూ శాస్త్రవేత్తలతో పంటనష్టం అంచనావేసి పరిహారం అందించేందుకు కృషిచేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జేడీ జగ్గారావు, జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, ఎంపీపీ పునుకుమాటి శేషులత, ఆత్మా పీడి వంశీ, శాస్త్రవేత్తలు ఫణి, రఘు, ఏడీఏ పి.మురళీకృష్ణ, ఏవో ఆర్‌ఎస్‌ ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-09-29T05:38:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising