ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్మిక అధికారిపై చర్యలు తీసుకోవాలంటూ ధర్నా

ABN, First Publish Date - 2021-10-27T05:55:02+05:30

భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు అమల్లో అవినీతికి పాల్పడుతూ కార్మికుల నుంచి లంచాలు డిమాండ్‌ చేస్తున్న తణుకు కార్మికశాఖాధికారి నాగమల్లేశ్వరావుపై విచారణ జరిపి తక్షణ చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి కోనాల బీమా రావు, భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇంటి వీరన్న డిమాండ్‌ చేశారు.

కార్మికశాఖ అధికారి కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న కార్మికులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తణుకు, అక్టోబరు 26: భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు అమల్లో అవినీతికి పాల్పడుతూ కార్మికుల నుంచి లంచాలు డిమాండ్‌ చేస్తున్న తణుకు కార్మికశాఖాధికారి నాగమల్లేశ్వరావుపై విచారణ జరిపి తక్షణ చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి కోనాల బీమా రావు, భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇంటి వీరన్న డిమాండ్‌ చేశారు. అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ కార్మిక శాఖ కార్యాలయం వద్ద మంగళవారం భవన నిర్మాణ కార్మికులు ధర్నా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు గండి రామకృష్ణ, నాగరాజు, గోవర్దనరావు, వెంకటేశ్వరావు, వల్లూరి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఎలాంటి అవినీతికి పాల్పడలేదు : మల్లేశ్వరరావు

భవన నిర్మాణ కార్మిక సంఘాలు ఆరోపించినట్లుగా ఎలాంటి అవినీతికి పాల్పడలేదని కార్మిక శాఖాధికారి కె.శివనాగమల్లేశ్వరరావు అన్నారు. క్లెయి మ్‌లు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందన్నారు. రెండేళ్ల నుంచి రావడం లేదన్నారు. సైట్‌ సమస్య వల్ల కార్డులు రావడం లేదన్నారు. కొన్ని కార్డులు వచ్చాయని వివరించారు.


Updated Date - 2021-10-27T05:55:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising