ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏజెన్సీలో మలేరియా నివారణ చర్యలు

ABN, First Publish Date - 2021-05-21T04:39:21+05:30

ఏజెన్సీ ప్రాంతాల్లో మలేరియా, డెంగ్యూ నివా రణ చర్యలు చేపట్టినట్లు మలేరియా సబ్‌ యూనిట్‌ ఆఫీసర్‌ వి.పెద్దిరాజు తెలిపారు.

దండిపూడి వద్ద కాల్వలో గంబూషియా చేపలను వదులుతున్న సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బుట్టాయగూడెం, మే 20: ఏజెన్సీ ప్రాంతాల్లో మలేరియా, డెంగ్యూ నివా రణ చర్యలు చేపట్టినట్లు మలేరియా సబ్‌ యూనిట్‌ ఆఫీసర్‌ వి.పెద్దిరాజు తెలిపారు. నివారణ చర్యల్లో భాగంగా గురువారం దొండపూడి, నందాపురం, మర్లగూడెం, అంతర్వేదిగూడెం ప్రాంతాల్లో దోమలు గుడ్లు పెట్టే నీటి ప్రదే శాలను గుర్తించి గంబూషియా చేప పిల్లలను విడుదల చేసినట్లు తెలిపారు. గంబూషియా చేప పిల్లలు ఎనఫిలిస్‌, ఎడిస్‌, క్యూలెక్స్‌ దోమల గుడ్లను తినేస్తాయని తద్వారా దోమల ఉత్పత్తి నిలిచిపోయి మలేరియా, డెంగ్యూ వ్యాధులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయన్నారు. ఈ చేపలు దోమల గుడ్లు, లార్వాను ఆహారంగా తీసుకుంటాయన్నారు. ఎడి బిఎల్‌ఎన్‌ కుమార్‌, జిల్లా మలేరియా అధికారి పీఎస్‌ఎస్‌వీ.ప్రసాద్‌ ఏజెన్సీలోని పలు ప్రాంతాల్లో పర్యటించి దోమల నివాస ప్రాంతాలను గుర్తించారని, అధికారుల సూచనలు ప్రకారం చేపలను విడుదల చేశామన్నారు. కార్యక్రమాల్లో వరలక్ష్మీ, దుర్గాప్రసాద్‌, నరసమ్మ, కన్నమ్మ, విజయశాంతి, మంగాయమ్మ, ప్రదీప్‌రెడ్డి, సిర్రమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-21T04:39:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising