ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏసీ కంప్రెషర్‌ పేలి ఇద్దరికి తీవ్ర గాయాలు

ABN, First Publish Date - 2021-04-14T05:15:00+05:30

ఎయిర్‌ కండీషన్‌కు మరమ్మతు చేస్తుండగా ప్రమాదవశాత్తు కంప్రెషర్‌ పేలిపోవడంతో మెకానిక్‌తో పాటు ఇంటి యజమానికి కూడా తీవ్ర గాయాలకు గురయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు క్రైం, ఏప్రిల్‌ 13 :ఎయిర్‌ కండీషన్‌కు మరమ్మతు చేస్తుండగా ప్రమాదవశాత్తు కంప్రెషర్‌ పేలిపోవడంతో మెకానిక్‌తో పాటు ఇంటి యజమానికి కూడా తీవ్ర గాయాలకు గురయ్యారు. ఏలూరు శ్రీరామ్‌నగర్‌ రెండోరోడ్డులో నివాసం ఉంటున్న ఎం.మాధవరావు ఇంటిలో ఏపీ పని చేయకపోవడంతో అమీనాపేటకు చెందిన ఏసీ మెకానిక్‌ కడలి వెంకటేశ్వరరావు (48)కి చెప్పారు. మంగళవారం ఉదయం 10 గంటలకు మెకానిక్‌ ఏసీని విప్పి ఆ ఇంటి గుమ్మం వద్ద మరమ్మతు చేస్తుండగా కంప్రెషర్‌ పేలిపోయింది. దీంతో కడలి వెంకటే శ్వరరావుకు కాలు విరిగిపోయి, చేతులకు శరీరానికి తీవ్ర గాయాలు కాగా, అక్కడే కూర్చుని ఉన్న ఇంటి యజమాని మాధవరావుకు తలకు తీవ్ర గాయమైంది.  ప్రస్తుతం ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.  ఈ ఘటనపై ఆసుపత్రి వైద్యులు ఎమ్మెల్సీగా నమోదు చేసిన ఆసుపత్రి ఔట్‌పోస్టు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

Updated Date - 2021-04-14T05:15:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising