ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంటర్‌ ఆల్‌ పాస్‌

ABN, First Publish Date - 2021-07-24T06:08:24+05:30

ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం ఫలి తాల్లో విద్యార్థులు పరీక్షలు రాయకుండానే నూరు శాతం ఉత్తీర్ణత సాధించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పరీక్ష ఫీజు చెల్లించిన 40,507 మంది సెకండియర్‌ విద్యార్థులంతా ఉత్తీర్ణులే..

సెకండ్‌ ఇయర్‌లోకి 38,820 మంది విద్యార్థులు

ఏలూరు ఎడ్యుకేషన్‌, జూలై 23 : ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం ఫలి తాల్లో విద్యార్థులు పరీక్షలు రాయకుండానే నూరు శాతం ఉత్తీర్ణత సాధించారు. వీరితోపాటు ప్రథమ సంవత్సరం విద్యార్థులంతా సెకండ్‌ ఇయర్‌లోకి ప్రమోట్‌ అయ్యారు. కరోనా విజృంభణతో సుప్రీంకోర్టు సూచనల మేరకు రద్దయిన ఇంట ర్‌ పరీక్షలకు ఫీజు చెల్లించిన విద్యార్థులంతా పాస్‌ కాగా, పదో తరగతి, ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ మార్కులకు వెయిటేజి ఇచ్చి సరాసరి గ్రేడ్‌ పాయింట్లతో సెకం డియర్‌ ఫలితాలను శుక్రవారం విడుదల చేశారు. ఇందులో 40 వేల 507 మంది ఉత్తీర్ణులు కాగా, వీరిలో జనరల్‌ విభాగం నుంచి 36 వేల 279 మంది, ఒకేషనల్‌ విభాగం నుంచి నాలుగు వేల 228 మంది విద్యార్థులు ఉన్నారు. సెకండ్‌ ఇయర్‌ విజేతల్లో 18 వేల 754 మంది బాలురు, 21 వేల 753 మంది బాలికలు ఉన్నారు. ఫస్ట్‌ ఇయర్‌ ఉత్తీర్ణతను 38 వేల 820 మంది విద్యార్థులు సాధించగా, రెగ్యులర్‌ విభాగం నుంచి 34 వేల 28 మంది, ఒకేషనల్‌ విభాగం నుంచి 4 వేల 792 మంది ఉన్నారు. వీరిలో 18 వేల 640 మంది బాలురు, 20 వేల 180 మంది బాలికలు ఉన్నారు. ఈ నెల 26వ తేదీ నుంచి సెకండ్‌ ఇయర్‌ ఉత్తీర్ణులకు మార్కుల జాబితాలు అందేలా సంబంధిత కళాశాలలకు పంపుతా మని ఇంటర్మీడియట్‌ విద్యామండలి జిల్లా అధికారులు వెల్లడించారు.  




Updated Date - 2021-07-24T06:08:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising