ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

16 మంది గిరిజన విద్యార్థినులకు అస్వస్థత

ABN, First Publish Date - 2021-03-07T05:27:12+05:30

కేఆర్‌ పురం ఐటీ డీఏ పరిధిలోని రాజానగరం గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలకు చెందిన 16 మంది విద్యార్థినులు శనివారం తీవ్ర అస్వస్థతకు గుర య్యారు.

కేఆర్‌ పురం పీహెచ్‌సీలో చికిత్స పొందుతున్న రాజానగరం హాస్టల్‌ విద్యార్థినులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజానగరం గిరిజన బాలికల వసతి గృహంలో ఘటన 

కేఆర్‌ పురం పీహెచ్‌సీకి  తరలింపు.. ఫుడ్‌ పాయిజన్‌ కాదన్న వైద్యులు

బుట్టాయగూడెం, మార్చి 6: కేఆర్‌ పురం ఐటీ డీఏ పరిధిలోని రాజానగరం గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలకు చెందిన 16 మంది విద్యార్థినులు శనివారం తీవ్ర అస్వస్థతకు గుర య్యారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో సీహెచ్‌ మురళీ కృష్ణ, కేఆర్‌ పురం వైద్యాధికారి డాక్టర్‌ రాజీవ్‌ వసతి గృహానికి వెళ్లి విద్యార్థినులకు వైద్య పరీ క్షలు చేశారు. అనారోగ్యంతో వున్న వారంతా జ్వ రం, నీరసం, షుగర్‌ లెవల్స్‌ తగ్గడం, అలసటకు గురికావడం, ఎక్కువ సమయం ఆటలు ఆడటం, వాతావరణ మార్పుల కారణంగా చిన్న చిన్న వ్యాధులకు గురైనట్లు గుర్తించి కేఆర్‌ పురం పీ హెచ్‌సీకి తరలించారు. చాలా మందికి షుగర్‌ లెవల్స్‌ తక్కువగా ఉండటంతో సెలైన్లు ఎక్కించి నట్లు వైద్యులు తెలిపారు. అందరి ఆరోగ్య పరి స్థితి బాగానే ఉందన్నారు. కె.స్పందన, టి.లావణ్య అనే విద్యార్థినులు నీరసంగా ఉండటంతో ఎక్స్‌రే కోసం జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి పంపామన్నారు. వింత వ్యాధులు, ఫుడ్‌ పాయిజన్‌ వంటివి కాదని స్పష్టం చేశారు. హాస్టల్‌ను సందర్శించి ఆరోగ్య పరిస్థితులు బాగానే ఉన్నట్లు డీడీ జి.వెంకటేశ్వరావు తెలిపారు.  

మంత్రి పుష్పశ్రీ వాణి ఆరా

విద్యార్థినుల అస్వస్థతపై గిరిజన శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి స్పందించారు. తక్షణమే బాలికలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని పీవో ఆర్వీ సూర్యనారాయణను ఆదేశించారు. 16 మంది అనారోగ్యం పాలైన విషయం తెలుసు కున్న ఆమె ఫోన్‌లో విలేకరులతో మాట్లాడారు. బాలికలకు మెరుగైన వైద్యం అందిస్తామని, ఘట నపై విచారణకు ఆదేశించామన్నారు. వసతి గృహాల్లో పారిశుధ్యం మెరుగుపర్చాలని సంబం ధిత అధికారులను ఆమె ఆదేశించారు. పిల్లల ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని ఎవరూ ఆందో ళన చెందాల్సిన అవసరం లేదన్నారు. 

Updated Date - 2021-03-07T05:27:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising