ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పశ్చిమగోదావరి జిల్లాలో వింత జ్వరాలు.. ముగ్గురు విద్యార్థుల మృతి

ABN, First Publish Date - 2021-12-05T23:57:23+05:30

పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం బోడిగూడెం‌లో జ్వరాలు పంజా విసురుతున్నాయి. కొద్ది రోజులుగా ప్రభుత్వ పాఠశాలలో పలువురు విద్యార్థులు జ్వరం బారిన పడుతున్నారు. ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం బోడిగూడెం‌లో జ్వరాలు పంజా విసురుతున్నాయి. కొద్ది రోజులుగా ప్రభుత్వ పాఠశాలలో పలువురు విద్యార్థులు జ్వరం బారిన పడుతున్నారు. జ్వరం, కడుపు నొప్పి కారణంగా ఇప్పటికే 50 మందికి పైగా విద్యార్థులు చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో నెల రోజుల వ్యవధిలో ముగ్గురు విద్యార్థులు జ్వరాల బారిన పడి మరణించడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. పాఠశాలలో 200 మందికి విద్యార్థులు ఉన్నారు. అయితే జ్వరాల భయంతో కేవలం 50 మంది విద్యార్థులు మాత్రమే తరగతులకు హాజరు అవుతున్నారు. 


తాజాగా పదవ తరగతి విద్యార్థి మృతి చెందడంతో గ్రామస్తులు పాఠశాల వద్ద ఆందోళన చేపట్టారు. ఈ వింత జ్వరాలతో తమ పిల్లలు మరణిస్తున్నారని పాఠశాల సిబ్బంది‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. త్రాగునీరు కలుషితం, మధ్యాహ్న భోజనం ఫుడ్ పాయిజన్ కారణంతో పాటు అపరిశుభ్రత వల్లే విద్యార్థులు చనిపోతున్నారని అంటూ పాఠశాలను మూయించి వేశారు. వరుస మరణాలతో విద్యార్థులు బెంబేలెత్తి పోతున్నారు. 



Updated Date - 2021-12-05T23:57:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising