ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏలూరు మేయర్‌గా షేక్ నూర్జహాన్‌ ప్రమాణం

ABN, First Publish Date - 2021-07-30T18:07:13+05:30

ఏలూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌గా నూర్జహాన్‌ పదవీ బాధ్యతలు చేపట్టారు. నూర్జన్‎హాన్‎తో పాటు డిప్యూటీ మేయర్లుగా గుడిదేశి శ్రీనివాస్, సుధీర్ బాబు ప్రమాణ స్వీకారం ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పశ్చిమ గోదావరి : ఏలూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌గా నూర్జహాన్‌ పదవీ బాధ్యతలు చేపట్టారు. నూర్జన్‎హాన్‎తో పాటు డిప్యూటీ మేయర్లుగా గుడిదేశి శ్రీనివాస్, సుధీర్ బాబు ప్రమాణ స్వీకారం చేశారు. ఏలూరు కార్పొరేషన్‌ ఆవిర్భవించిన తర్వాత మూడోసారి జరిగిన ఎన్నికల్లో వైసీపీ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. కాగా.. కార్పొరేషన్‌ ఎన్నికల్లో 50 డివిజన్లకు 47 మంది వైసీపీకి చెందిన వారు ముగ్గురు టీడీపీకి చెందిన వారు కార్పొరేటర్లుగా గెలుపొందారు. వీరిలో వైసీపీకి చెందిన ఇద్దరు కార్పొరేటర్‌ అభ్యర్థులు కరోనా కారణంగా మరణించారు. మిగిలిన 48 మంది అభ్యర్థులతో కౌన్సిల్‌ కొలువుదీరింది.


ఎవరీ నూర్జహాన్..?

గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోను ఆమె ఐదేళ్లపాటు ఎటువంటి ఆటంకాలు లేకుండా మేయర్‌గా కొనసాగారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు ఆమె టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. ఈసారి కార్పొరేషన్‌ ఎన్నికల్లో వైసీపీ తరపున 50వ డివిజన్‌ కార్పొరేటర్‌గా పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆమె భర్త ఎస్‌ఎంఆర్‌ పెదబాబు మొత్తం నగర పంచాయతీ ఎన్నికలను భుజాన వేసుకున్నారు. అనేక డివిజన్లలో వైసీపీ అభ్యర్థుల గెలుపు కోసం పెదబాబు ప్రయత్నాలు సఫలీకృతమయ్యాయి. సీఎం జగన్‌ ఆశీస్సులతో నూర్జహాన్‌ ఎన్నికల ముందు నుంచే మేయర్‌ అభ్యర్థిగా ఖరారయ్యారు. చివరకు అదే ప్రక్రియ కొనసాగింది. ఈ మధ్యలో కొన్ని కొన్ని అపోహలు పెద్ద ఎత్తున ప్రచారం సాగినా అవన్నీ వీగిపోయాయి.


నానీ విధేయులుకే..!

డిప్యూటీ సీఎం ఆళ్ల నాని సహకారంతో డివిజన్లలో కార్పొరేటర్లుగా ఎన్నికైన వారంతా తమకు ఏదో పదవి అదనంగా వస్తుందని ఆశించారు. శుక్రవారం ఏలూరు మేయర్‌ పదవితో పాటు ఇద్దరు డిప్యూటీ మేయర్లను ఎన్నుకున్నారు. ఆ ఇద్దరూ ఇవాళ ప్రమాణ స్వీకారం కూడా చేశారు. మంత్రి ఆళ్ల నానికి మొదటి నుంచి వీర విధేయులుగావున్న మాజీ ఎంపీపీ సుధీర్‌బాబు, మరో సీనియర్‌ నేత గుడిదేశి శ్రీనివాసరావును డిప్యూటీ మేయర్లుగా ఎన్నికయ్యారు.  వీరి పదవీ కాలం ఏడాదిపాటు ఉంటుంది. కాగా.. ఇంతకుముందు డిప్యూటీ మేయర్‌ పదవి ఒకటే ఉండగా ఏడాదికి ఒకరు చొప్పున ఐదేళ్లకు ఐదుగురిని ఎంపిక చేసి నియమించడంలో అప్పటి ఎమ్మెల్యే బడేటి బుజ్జి సరికొత్త వ్యూహాన్ని అమలు చేసిన విషయం విదితమే.

Updated Date - 2021-07-30T18:07:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising