ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మేమూ పాదయాత్ర చేస్తాం: రాయలసీమ హక్కుల నేత

ABN, First Publish Date - 2021-12-19T00:04:00+05:30

తాము కూడా మూడు రాజధానుల అంశంపై పాదయాత్ర చేస్తామని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: తాము కూడా మూడు రాజధానుల అంశంపై పాదయాత్ర చేస్తామని రాయలసీమ హక్కుల నేత  భూమన సుబ్రహ్మణ్యంరెడ్డి ప్రకటించారు. పట్టణంలో మూడు రాజధానులకు మద్దతుగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు. అమరావతి రైతులు కోల్పోయిన భూముల గురించి మాత్రమే మాట్లాడాలన్నారు. శ్రీకాకుళం లేదా శ్రీశైలం నుంచి అమరావతి వరకు మూడు రాజధానుల అంశంపై పాదయాత్ర చేస్తామన్నారు. రాయలసీమ అభివృద్ధి వికేంద్రీకరణ గురించి ప్రతి కళాశాల దగ్గరకు వెళ్లి చైతన్య సభలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు.  


1953లో ఏపీ ఏర్పడినప్పుడు కర్నూలు రాజధాని, గుంటూరులో హైకోర్టు ఏర్పాటు చేయాలని తీర్మానం జరిగిందన్నారు. ఇప్పుడు మరొక ప్రాంతాన్ని జోడించి మూడు రాజధానులుగా చేశారన్నారు. శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం ఆర్థికంగా, రాజకీయంగా ఏం చెయ్యాలో అదే ప్రభుత్వం చేసిందని ఆయన పేర్కొన్నారు. 





5 కోట్ల ఆంధ్రులు ఆంద్రప్రదేశ్ అధికార వికేంద్రీకరణ వైపు మొగ్గు చూపుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఆంద్రప్రదేశ్ రాజధాని అమరావతి అనడం వెనుక చాలా మతలబు ఉందన్నారు. 10 లక్షలు విలువ చెయ్యని ఎకరం భూమి నేడు అమరావతి రాజధానిగా ప్రకటించిన అనంతరం కోట్లు పలుకుతున్నాయన్నారు. బాగా పంటలు పండే భూములను 2014 లో అమరావతి నిర్మాణం కోసం ఇచ్చి రైతులు తప్పు చేశారన్నారు. రాజధాని నిర్మాణం కోసం ఎంత భూమి, ఎంత డబ్బు కావాలనే అంశంపై ఆలోచన లేకుండా రాష్ట్రాన్ని టీడీపీ అల్లకల్లోలం చేసిందని ఆరోపించారు.


అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమం అనైతికంగా చట్ట వ్యతీరేకమన్నారు.  అమరావతి రైతులు భూములకు సంబంధించి నష్టపరిహారం గురించి మాత్రమే అడగాలన్నారు. రాజధాని గురించి మాట్లాడే హక్కు ఒక్క అమరావతి రైతులది మాత్రమే కాదు...ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరిదన్నారు. 

Updated Date - 2021-12-19T00:04:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising