ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాధితురాలికి అండగా ఉంటాం: వాసిరెడ్డి పద్మ

ABN, First Publish Date - 2021-06-21T20:51:23+05:30

ప్రియుడ్ని కట్టేసి ప్రియురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన తాడేపల్లి పరిధిలోని సీతానగరం పుష్కరఘాట్ల వద్ద శనివారం రాత్రి జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: తాడేపల్లి అత్యాచార ఘటన దురదృష్టకరం, బాధాకరమని మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మా అన్నారు.  జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితురాలిని వాసిరెడ్డి పద్మా పరామర్శించారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పద్మ మీడియాతో మాట్లాడుతూ.. బాధితురాలితో మాట్లాడానని. ధైర్యం చెప్పానన్నారు. ఆమెకు ధైర్యాన్ని నింపాల్సిన పరిస్థితి మనపై ఉందన్నారు. 


బాధితురాలికి అండదండగా ఉంటామని సీఎం జగన్ హామీ ఇచ్చారన్నారు. బ్లేడ్ బ్యాచ్ ఈ అఘాయిత్యానికి పాల్పడిందన్నారు. త్వరలోనే ఈ కేసును చేధిస్తామని చెప్పారు. పోలీసుల కళ్లు కప్పి తప్పించుకున్న నిందితులకి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని హెచ్చరించారు. మహిళా రక్షణ కోసమే ప్రభుత్వం దిశ చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. నిందితులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని వాసిరెడ్డి పద్మ హెచ్చరించారు. 

Updated Date - 2021-06-21T20:51:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising