రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ABN, First Publish Date - 2021-10-30T05:01:32+05:30
మండలంలోని ఎల్.కోట-సోంపురం మధ్యలో విశాఖ-అరుకు రోడ్డు మార్గంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో పేర్ల ధనేష్ (22) అనే యువకుడు మృతి చెందాడు.
లక్కవరపుకోట: మండలంలోని ఎల్.కోట-సోంపురం మధ్యలో విశాఖ-అరుకు రోడ్డు మార్గంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో పేర్ల ధనేష్ (22) అనే యువకుడు మృతి చెందాడు. ఎల్.కోట హెడ్ కానిస్టేబుల్ జి.శ్రీనివాసరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ధనేష్ తన స్నేహితుడు గుణశేఖర్‌తో కలిసి బైకుపై విశాఖపట్టణం నుంచి అరకు వెళ్తున్నాడు. ఎల్.కోట జంక్షన్ దాటాక సోంపురం జంక్షన్ ముందుగా అసంపూర్తిగా నిర్మించిన బ్రిడ్జి వద్ద బైకు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. విషయం తెలుసుకున్న పోలీ సులు వెంటనే అక్కడికి చేరుకొని క్షతగాత్రులను ఎస్.కోట సీహెచ్‌సీకి తరలిం చారు. ధనేష్ తీవ్రంగా గాయపడడంతో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతు డు విశాఖ పట్టణం జిల్లా పెదగంట్యాడ మండలం గంగవరంనకు చెందినవాడిగా గుర్తించారు. ఇంజినీరింగ్ డిప్లమో చదివి స్టీల్‌ప్లాంట్‌లో ప్రైవేటుగా ఉద్యోగం చేస్తు న్నాడు. మృతుడి స్నేహితుడు గుణశేఖర్ స్వల్పంగా గాయపడ్డాడు. ఈ సంఘ టనపై కేసు నమోదు చేసినట్టు హెచ్‌సీ శ్రీనివాసరావు తెలిపారు.
అసంపూర్తి బ్రిడ్జి నిర్మాణం.. హెచ్చరిక బోర్డులు లేని వైనం
అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి వద్ద ఎటువంటి హెచ్చరిక బోర్డులనుగానీ, డివైడర్లుగానీ రోడ్ర భద్రతా అధికారులు ఏర్పాటు చేయలేదు. గతంలో కూడా ఇక్కడ ప్రమాదం జరిగి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. 2018 నుంచి బ్రిడ్జి నిర్మాణ పనులు మొదలుపెట్టారు. 2019లో ప్రభుత్వం మారాక పనులు నిలుపుదల చేశా రు. అప్పటి నుంచి పక్క నుంచి ఏర్పాటు చేసిన ప్రత్యామ్నాయ రోడ్డుపై వాహనా లు వెళ్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరచి బ్రిడ్జి పనులు పూర్తిచేయాలని ప్రయాణీకులు కోరుతున్నారు.
Updated Date - 2021-10-30T05:01:32+05:30 IST