జామి ఎల్లారమ్మ జాతరకు వేళాయే
ABN, First Publish Date - 2021-03-20T04:40:27+05:30
ల్లారమ్మ జాతరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం నుంచి జాతర ప్రారంభంకానుంది. కీలక ఘట్టమైన తొలేళ్ల ఉత్సవం శనివారం నిర్వహించనున్నారు. అమ్మ
నేడు తొలేళ్ల ఉత్సవం
రేపు జాతర, 22న చినతీర్థం
పూర్తయిన ఏర్పాట్లు
శృంగవరపుకోట రూరల్ (జామి) మార్చి 19 :
జామి ఎల్లారమ్మ జాతరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం నుంచి జాతర ప్రారంభంకానుంది. కీలక ఘట్టమైన తొలేళ్ల ఉత్సవం శనివారం నిర్వహించనున్నారు. అమ్మవారి గద్దెగుడిలో పూజలు చేసిన అనంతరం రాత్రి 9.45 గంటలకు వనం గుడికి బయలుదేరనున్నారు. అర్ధరాత్రి దాటిన తరువాత గుడిలో ప్రవేశించనున్నారు. ఆదివారం జాతర, సోమవారం చినతీర్థం నిర్వహిస్తారు. పండుగకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు ఈవో శ్రీనివాస్ తెలిపారు. ఉత్తరాంధ్రతో పాటు ఒడిశా, చత్తీస్‌గడ్‌ల నుంచి సుమారు లక్షకు పైగా భక్తులు హాజరవుతారని అంచనా. ఇప్పటికే బంధువులు, సూదుర ప్రాంతాల్లో స్థిరపడిన ఉద్యోగులు, స్నేహితులు పెద్దఎత్తున జామికి చేరుకున్నారు. దీంతో సందడి వాతావరణం నెలకొంది.
Updated Date - 2021-03-20T04:40:27+05:30 IST