ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బకాయిల వసూళ్లకు మల్లగుల్లాలు

ABN, First Publish Date - 2021-01-16T05:03:09+05:30

గ్రామ పంచాయతీల నుంచి వీధిదీపాలు, తాగునీటి సరఫరాకు వినియోగించే విద్యుత్‌ బిల్లుల బకాయిలను వసూలు చేసేందుకు ఆ శాఖ మల్లగుల్లాలు పడుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బొబ్బిలి: గ్రామ పంచాయతీల నుంచి వీధిదీపాలు, తాగునీటి సరఫరాకు వినియోగించే విద్యుత్‌ బిల్లుల బకాయిలను వసూలు చేసేందుకు ఆ శాఖ మల్లగుల్లాలు పడుతోంది. జిల్లావ్యాప్తంగా రూ.42 కోట్ల మేర బకాయిలు పేరుకుపోగా అందులో  బొబ్బిలి విద్యుత్‌ డివిజన్‌ పరిధి లోని 272 గ్రామపంచాయతీల నుంచి రూ. 11 కోట్లు వసూలు కావల్సి ఉంది. ఈ మేరకు 14 , 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి  కనీసం 50 శాతమైనా చెల్లించాలని ఆ శాఖాధికారులు  కలెక్టర్‌ను కోరుతున్నారు. జిల్లాకు ఆర్థిక సంఘం నిధులు రూ.95.35 కోట్లు విడుదలయ్యాయి. అం దులో 50 శాతం నిధులను విద్యుత్‌ బకాయిల కోసం కేటాయిస్తే దాదాపుగా బకాయిల చెల్లింపు జరిగిపోతుందని ఆ శాఖాధికారులు భావిస్తున్నారు. 15 వ ఆర్థిక సంఘం నిధుల్లో 50 శాతం నిధులను నీటిసరఫరా, పారిశుధ్య నిర్వహణకు కేటాయించాలని నిర్దేశించినందున తాగునీటి సరఫరా ప్ర క్రియలో విద్యుత్‌ మోటార్ల వినియోగం కూడా ఉంది. ఈ నిబంధన తమ విద్యుత్‌ బకాయిలు వసూళ్లకు ఉపయుక్తంగా ఉంటుందని విద్యుత్‌ శాఖ ఆశావహంగా ఉంది. పేరుకుపోయిన విద్యుత్‌ బకాయిల వసూళ్ల కోసం మండలానికి ఒక జేఏవోను నియమించి స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నామని ఆ శాఖ ఈఈ  సుదర్శనరావు తెలిపారు.  ఆర్థిక సంఘం నిధులు   తమ బకాయిల కోసం కేటాయించాలని కలెక్టర్‌కు ఉన్నతాధికారులు లేఖ రాశారన్నారు. 

 

Updated Date - 2021-01-16T05:03:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising