ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళలే ‘కీ’లకం!

ABN, First Publish Date - 2021-08-02T05:08:56+05:30

జిల్లాలో కీలక అధికారులంతా మహిళలే. కలెక్టర్‌, ఎస్పీ నుంచి వివిధ శాఖల విభాగాధిపతుల వరకూ అతివలే. మహిళా సాధికారికతకు ప్రభుత్వాలు ప్రాధాన్యమిస్తున్న ప్రస్తుత తరుణంలో మహిళా అధికారుల సంఖ్య పెరగడం శుభ పరిణామం. ఇప్పటికే స్థానిక సంస్థల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగగా... క్షేత్రస్థాయిలో పాలన అందించే జిల్లా యంత్రాంగంలో కీలక పోస్టులో మహిళా అధికారులు కొలువుదీరడం విశేషం

కలెక్టర్‌, ఎస్పీ, సబ్‌ కలెక్టర్‌, డీఎంహెచ్‌వో, డీఈవోలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టర్‌, ఎస్పీ, డీఈవో, డీఎంహెచ్‌వో, సబ్‌ కలెక్టర్లు అతివలే

జిల్లాలో కీలక శాఖల విభాగాధిపతులూ వారే..

(కలెక్టరేట్‌)

జిల్లాలో కీలక అధికారులంతా మహిళలే. కలెక్టర్‌, ఎస్పీ నుంచి వివిధ శాఖల విభాగాధిపతుల వరకూ అతివలే. మహిళా సాధికారికతకు ప్రభుత్వాలు ప్రాధాన్యమిస్తున్న ప్రస్తుత తరుణంలో మహిళా అధికారుల సంఖ్య పెరగడం శుభ పరిణామం. ఇప్పటికే స్థానిక సంస్థల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగగా... క్షేత్రస్థాయిలో పాలన అందించే జిల్లా యంత్రాంగంలో కీలక పోస్టులో మహిళా అధికారులు కొలువుదీరడం విశేషం. సుదీర్ఘ విరామం తరువాత జిల్లాకు రెండో మహిళా కలెక్టర్‌గా ఏ.సూర్యకుమారి వచ్చారు. కొద్దిరోజుల కిందట బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటికే ఎస్పీగా దీపికా పాటిల్‌, పార్వతీపురం సబ్‌ కలెక్టర్‌గా భావ్న విధులు నిర్వహిస్తున్నారు. డీఈవోగా నాగమణి, డీఎంహెచ్‌వోగా రమణకుమారి, వ్యవసాయ శాఖ జేడీగా ఆశాదేవి కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. విద్య, వైద్యం, వ్యవసాయ శాఖల్లో పాలనాపరంగా తమ ముద్ర చూపిస్తున్నారు. తమ శాఖల పరిధిలో అపరిష్కృత సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుతో పాటు అభివృద్ధి పనులు చేపడుతూ ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వ శాఖల పనితీరు విషయంలో రాష్ట్రస్థాయిలో జిల్లాకు గుర్తింపు తెచ్చిపెడుతున్నారు.

18 శాఖలకు..

జిల్లా ప్రణాళికా అధికారి, డీపీఎం, డ్వామా పీడీ, జిల్లా పంచాయితీ అధికారి, బీసీ కార్పోరేషన్‌ ఈడీ, బీస సంక్షేమ శాఖ అధికారి, ఐసీడీఎస్‌ పీడీ, ఆర్‌ఆండ్‌బి ఎస్‌ఈ, మైన్స్‌ ఏడీ, జిల్లా అడిట్‌ ఆఫీసర్‌, మత్య్స శాఖ డీడీ, జిల్లా రవాణా శాఖ కమిషనర్‌, సాంఘిక సంక్షేమ గురుకులు పాఠశాల కన్వీనర్‌ వంటి కీలక పోస్టుల్లో మహిళా అధికారులే ఉన్నారు. గత ఏడాదిగా కరోనా విపత్తు సమయంలో కూడా సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ వస్తున్నారు. రాష్ట్రంలోనే మహిళా అధికారులు ఎక్కువగా పనిచేస్తున్న జిల్లాలో విజయనగరం ఒకటి కావడం మనకు గర్వకారణం.


Updated Date - 2021-08-02T05:08:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising