ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓటు వేయలేదని పింఛన్ల నిలిపివేత

ABN, First Publish Date - 2021-03-07T05:12:57+05:30

అధికార పార్టీ మద్దతు అభ్యర్థికి ఓటు వేయలేదని తమ పింఛన్లు నిలిపివేశారంటూ పెదపథం, బాగువలస గ్రామాలకు చెందిన పలువురు సాలూరు ఎంపీడీవో కార్యాలయం వద్ద శనివారం బైఠాయించారు.

ఎంపీడీవో కార్యాలయం వద్ద బైఠాయించిన పింఛన్‌దారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  ఆందోళన చేపట్టిన బాధితులు

సాలూరు రూరల్‌, మార్చి 6: అధికార పార్టీ మద్దతు అభ్యర్థికి ఓటు వేయలేదని తమ పింఛన్లు నిలిపివేశారంటూ పెదపథం, బాగువలస గ్రామాలకు చెందిన పలువురు సాలూరు ఎంపీడీవో కార్యాలయం వద్ద శనివారం బైఠాయించారు. సీపీఎం నేత మర్రి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆయా గ్రామాలకు చెందిన పెదపథం పైడియ్య, లక్ష్మణరావు, దాలయ్య, లక్ష్మణ, కొమ్మ గంగయ్య, అప్పన్నలు నిరసన తెలిపారు. పంచాయతీ ఎన్నికల ముందు  ఇద్దరు వలంటీర్లు తమపై ఓటు కోసం ఒత్తిడి తెచ్చారని, అనంతరం తమ పింఛన్లు నిలిపివేశారని చెప్పారు. పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్తే వారికే కొమ్ము కాశారని ఆరోపించారు. వారిపై విచారణ చేపట్టి, చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎంపీడీవో గొల్లపల్లి పార్వతికి వినతిపత్రం అందించారు. సీపీఎం నేత మర్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఓటు వేయకుంటే పింఛన్లు నిలిపివేయడం దారుణమన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామన్నారు. అనంతరం ఎంపీడీవో స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ దీనిపై విచారణ చేపట్టి, వచ్చిన నివేదిక మేరకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

 

 

Updated Date - 2021-03-07T05:12:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising