ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దళితులపై ఈ వివక్ష ఎందుకు..?

ABN, First Publish Date - 2021-05-08T05:18:19+05:30

మండలంలో ఉపాధి హామీశాఖ అధికారులు కేవలం దళితవర్గానికి చెందిన క్షేత్రసహా యకులను లక్ష్యంగా చేసుకుని వేధిం పులకు పాల్పడటంతో పాటు వారిని ఆ కారణంగా ఉద్యోగాల నుంచి తొలగి స్తున్నారని మండలంలోని జామి, అల మండ గ్రామాలకు చెందిన క్షేత్ర సహాయకులు ఇప్పాక ఈశ్వరరావు, కోట మురళీ ఆవేదన వ్యక్తంచేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శృంగవరపుకోట రూరల్‌ (జామి) మే 7: మండలంలో ఉపాధి హామీశాఖ అధికారులు కేవలం దళితవర్గానికి చెందిన క్షేత్రసహా యకులను లక్ష్యంగా చేసుకుని వేధిం పులకు పాల్పడటంతో పాటు వారిని ఆ కారణంగా ఉద్యోగాల నుంచి  తొలగి స్తున్నారని మండలంలోని జామి, అల మండ గ్రామాలకు చెందిన క్షేత్ర సహాయకులు ఇప్పాక ఈశ్వరరావు, కోట మురళీ ఆవేదన వ్యక్తంచేశారు. జిల్లా అధికారులు, మండల అధికారులు అకా రణంగా తమను ఉద్యోగాలనుంచి తొల గించారని బాధను వ్యక్తంచేస్తూ జామిలో ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి శుక్రవారం  వినతిపత్రం అందించారు. అనంతరం వారు విలేకర్లతో మాట్లాడుతూ  ఏళ్ల తరబడి ఎంతో నిజాయతీతో పనిచేస్తుంటే తొలగించడం దారుణమన్నారు. తమపై ఫిర్యాదులు వస్తున్నాయని, తాము ఉద్యోగాలకు పనికిరామని చెప్తూ అధికారులు తమను తొలగించారన్నారు. తప్పుచేస్తే బహిరంగ విచారణ గ్రామాల్లో నిర్వహించి తొలగించాలి తప్ప ఏకపక్షంగా కాదన్నారు. ఈ విషయంపై ఉపాధిహామీ ఏపీవో శేఖర్‌ను వివరణ కోరగా ఫోన్‌ స్వీచ్‌ ఆఫ్‌ అని వచ్చింది. ఎంపీడీవో సతీష్‌ను వివరణ కోరగా జామి క్షేత్రసహాయకుడు ఈశ్వరరావు రికార్డులు సరిగా నిర్వహించడంలేదని, దీంతో పీడీ సదరు క్షేత్రసహాయకుడ్ని తొలగించాలంటూ ఆదేశాలు జారీ చేశారన్నారు.

Updated Date - 2021-05-08T05:18:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising