ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వలంటీర్లతోనే సంక్షేమం

ABN, First Publish Date - 2021-04-15T05:40:59+05:30

కుల, మతాలు, పార్టీలకు అతీతంగా ప్రజల్లో మమేకమై నిరంతరం ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నది వలంటీ ర్లేనని ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి
కురుపాం, ఏప్రిల్‌ 14:
కుల, మతాలు, పార్టీలకు అతీతంగా ప్రజల్లో మమేకమై నిరంతరం ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నది వలంటీ ర్లేనని ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి అన్నారు. బుధవారం కురుపాం నియోజకవర్గం వలంటీర్ల సత్కార సభ కురుపాంలో నిర్వహించారు. ఈ కార్యక్ర మానికి ముఖ్య అతిథిగా పుష్పశ్రీవాణి హాజరై మాట్లాడారు. ముందుగా అంబేడ్కర్‌ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మహాత్మా గాంధీ కలలు గన్న స్వరాజ్యం వలంటీర్లు, సచివాలయాలతో సాధ్యమైందన్నారు. ఉగాది పురస్కారాల సందర్భంగా వలంటీర్లకు సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర అంద జేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఐదుగురు వలంటీర్లకు సేవా వజ్ర, 25 మందికి, 1347 మందికి సేవా రత్న, మిత్ర పురస్కారాలతో సత్క రించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ డాక్టర్‌ హరిజవహర్‌ లాల్‌ మాట్లాడుతూ ప్రభుత్వ  పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించి, వారికి అందించే భాధ్యత వలం టీర్లదేనన్నారు. జిల్లాకు రెండు నెలల పాటు కరోనా కేసులు రాకుండా నియంత్రిం చడంలో ప్రతి ఒక్కరి సహకారం ఉందన్నారు. ప్రస్తుతం కరోనా పెరగకుండా మా స్కులు ధరించేలా, సామాజిక దూరం పాటించేలా ప్రజలకు అవగాహన కల్పించే బాధ్యత వలంటీర్లదేనన్నారు. కార్యక్రమంలో ఎస్పీ బి.రాజకుమారి, జేసీ మహేష్‌ కుమార్‌ రావిరాల, ఐటీడీఏ పీవో కూర్మనాథ్‌, సబ్‌ కలెక్టర్‌ విధేఖర్‌, వివిధ శాఖల అధికారులు, వైసీపీ నాయకులు, వలంటీర్లు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-15T05:40:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising