ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రామస్వరాజ్య సాధనకే వలంటీరు వ్యవస్థ

ABN, First Publish Date - 2021-04-13T04:51:40+05:30

గ్రామ స్వరాజ్య సాధనకే వలంటీర్‌ వ్యవస్థను ప్రారంభించినట్టు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విజయనగరం నియోజకవర్గంలో ఉత్తమ సే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50




విజయగనరం (ఆంధ్రజ్యోతి) ఏప్రిల్‌ 12: గ్రామ స్వరాజ్య సాధనకే వలంటీర్‌ వ్యవస్థను ప్రారంభించినట్టు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విజయనగరం నియోజకవర్గంలో ఉత్తమ సేవలందించిన వలంటీర్లకు సోమవారం ఘనంగా సన్మానించారు. ఆనందగజపతి ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి బొత్స ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐదుగురు వలంటీర్లకు సేవా వజ్ర, 16 మందికి సేవా రత్న, 1,100 మంది సేవా మిత్ర పురస్కారాలను అందించారు.  నగదుతో పాటు ప్రశంసాపత్రాలను మంత్రి అందించారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ వలంటీర్ల వ్యవస్థను అపహేళన చేశారని గుర్తుచేశారు. కరోనా వంటి విపత్తు సమయంలో వారి సేవలే అవసరమయ్యాయన్నారు. కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని వలంటీర్లకు సూచించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో వలంటీర్లు మంచి పాత్ర వహిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో ఎస్పీ రాజకుమారి, జేసీలు మహేష్‌కుమార్‌, వెంకటరావు, జడ్పీ సీఈవో వెంకటేశ్వరరావు, డీపీవో సునీల్‌రాజ్‌కుమార్‌, ఎమ్మెల్యేలు కోలగట్ల వీరభద్రస్వామి, బడ్డుకొండ అప్పలనాయుడు, మేయర్‌ వెంపడాపు విజయలక్ష్మి, కమిషన్‌ వర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కొవిడ్‌ నిబంధనలు పాటించకపోవడం విమర్శలకు తావిచ్చింది. 







 




Updated Date - 2021-04-13T04:51:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising