ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రణాళికాబద్ధంగా వ్యాక్సినేషన్‌

ABN, First Publish Date - 2021-05-15T04:45:46+05:30

జిల్లాలో రెండో డోస్‌ వ్యాక్సినేషన్‌ను ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తామని కలెక్టర్‌ హరి జవహర్‌లాల్‌ అన్నారు. శనివారం నుంచి జిల్లాలో కొవిషీల్డ్‌తోపాటు కొవాగ్జిన్‌ టీకా కూడా వేయనున్నట్లు చెప్పారు. కొవాగ్జిన్‌ రెండో డోసుకు జిల్లా వ్యాప్తంగా 23 కేంద్రాలు, కొవిషీల్డ్‌ కోసం 43 కేంద్రాలను పాఠశాలల్లో కొత్తగా ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కేంద్రాల్లో శనివారం వ్యాక్సిన్‌ వేస్తామని వెల్లడించారు. నిపుణుల కమిటీని సంప్రదించిన తరువాత కేంద్ర ప్రభుత్వం కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కాల వ్యవధిని తాజాగా పెంచిందన్నారు. ఏ రోజు ఎవరికి టీకా వేస్తారు? ఏ ఆరోగ్య కేంద్రానికి వెళ్లాలో నిర్దిష్టంగా 24 గంటల ముందే ఫోన్‌ కాల్‌ , మెసేజ్‌ ద్వారా జిల్లా యంత్రాంగం సమాచారం అందిస్తుందని చెప్పారు. వలంటీర్లు, ఆశా వర్కర్ల ద్వారా వ్యాక్సినేషన్‌ స్లిప్‌ను అందజేస్తామన్నారు. సమాచారం అందుకున్న వారే సంబందింత ఆరోగ్య కేంద్రాలకు వెళ్లాలని తెలిపారు.

మాట్లాడుతున్న కలెక్టర్‌ హరి జవహర్‌లాల్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50






కలెక్టరేట్‌, మే 14: జిల్లాలో రెండో డోస్‌ వ్యాక్సినేషన్‌ను ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తామని కలెక్టర్‌ హరి జవహర్‌లాల్‌ అన్నారు. శనివారం నుంచి జిల్లాలో కొవిషీల్డ్‌తోపాటు కొవాగ్జిన్‌ టీకా కూడా వేయనున్నట్లు చెప్పారు. కొవాగ్జిన్‌ రెండో డోసుకు జిల్లా వ్యాప్తంగా 23 కేంద్రాలు, కొవిషీల్డ్‌ కోసం 43 కేంద్రాలను పాఠశాలల్లో కొత్తగా ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కేంద్రాల్లో శనివారం వ్యాక్సిన్‌ వేస్తామని వెల్లడించారు. నిపుణుల కమిటీని సంప్రదించిన తరువాత కేంద్ర ప్రభుత్వం కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కాల వ్యవధిని తాజాగా పెంచిందన్నారు. ఏ రోజు ఎవరికి టీకా వేస్తారు? ఏ ఆరోగ్య కేంద్రానికి వెళ్లాలో నిర్దిష్టంగా 24 గంటల ముందే ఫోన్‌ కాల్‌ , మెసేజ్‌ ద్వారా  జిల్లా యంత్రాంగం సమాచారం అందిస్తుందని చెప్పారు. వలంటీర్లు, ఆశా వర్కర్ల ద్వారా వ్యాక్సినేషన్‌ స్లిప్‌ను అందజేస్తామన్నారు. సమాచారం అందుకున్న వారే సంబందింత ఆరోగ్య కేంద్రాలకు వెళ్లాలని తెలిపారు.


ఉత్తమ సేవలే లక్ష్యం

 బాధితులకు ఉత్తమ సేవలందించడమే తమ లక్ష్యమని కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ చెప్పారు. కలెక్టరేట్‌ మీటింగ్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన కొవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను శుక్రవారం సందర్శించారు. టెస్టుల ఫలితాలు ఇవ్వడంలో తలెత్తుతున్న సమస్యలకు పరిష్కారం  చూపాలని సిబ్బందికి సూచించారు.  ల్యాబ్‌లకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఆర్‌టీపీసీఆర్‌ టెస్టులు చేయాలని,  దూరంగా ఉన్న ప్రాంతాల్లో ర్యాపిడ్‌ టెస్టులు చేయాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు.  కొవిడ్‌ బాధితుల కోసం జిల్లాలో అదనంగా 250 బెడ్లు కేటాయిస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. జిల్లా ఆసుపత్రిలో 100 పడకలు, మిమ్స్‌లో 100, పార్వతీపురం ఏరియా ఆసుపత్రిలో 50 పడకలు అదనంగా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రకటించారు. ఆయన వెంట డీఎంహెచ్‌వో రమణకుమారి, కొవిడ్‌ వైద్యులు వెంకటేష్‌ , మేఘన తదితరులు ఉన్నారు. 


 


Updated Date - 2021-05-15T04:45:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising