ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యాక్సిన్‌ వేయండి.. ప్రాణాలు నిలపండి!

ABN, First Publish Date - 2021-05-09T05:10:35+05:30

కొవిడ్‌ సెకెండ్‌ వేవ్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వానికి నిర్లక్ష్య వైఖరి తగదని టీడీపీ నేతలు మండిపడ్డారు. అందరికీ టీకాలు వేసి.. ప్రాణాలు నిలపాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం జిల్లావ్యాప్తంగా నిరసన తెలిపారు.

సాలూరులో ప్లకార్డులతో నిరసన తెలుపుతున్న మాజీ ఎమ్మెల్యే భంజ్‌దేవ్‌, టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

   టీడీపీ నేతల డిమాండ్‌ 

 జిల్లావ్యాప్తంగా నిరసన 

 సర్కార్‌ తీరుకు వ్యతిరేకంగా ప్లకార్డులతో ప్రదర్శన 

 కొవిడ్‌పై నిర్లక్ష్యం తగదని మండిపాటు 

 (ఆంధ్రజ్యోతి బృందం)

కొవిడ్‌ సెకెండ్‌ వేవ్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వానికి నిర్లక్ష్య వైఖరి తగదని టీడీపీ నేతలు మండిపడ్డారు.  అందరికీ టీకాలు వేసి.. ప్రాణాలు నిలపాలని  డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం జిల్లావ్యాప్తంగా నిరసన తెలిపారు. కరోనా నిబంధనలు పాటిస్తూ.. ఇళ్లు, పార్టీ కార్యాలయాల్లో  సర్కార్‌ తీరుకు వ్యతిరేకంగా ప్లకార్డులతో ప్రదర్శన చేపట్టారు. కరోనా నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కొవిడ్‌ బాధితులను ఆదుకునే వారే కరువయ్యారన్నారు. ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్‌, మెరుగైన వైద్యం దొరక్క నానా అవస్థలు పడుతున్నారన్నారు. ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నా.. సర్కార్‌ స్పందించకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలు కాపాడాల్సింది పోయి రాజకీయలు చేయడం తగదన్నారు. కరోనా కేసులు పెరగడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని తెలిపారు. సకాలంలో వ్యాక్సిన్లు, టెస్టులు చేయకుండా చేతులెత్తేయడం భావ్యం కాదన్నారు.  ప్రభుత్వం స్పందించి యుద్ధప్రాతిపదికన తగు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. 

 

 

Updated Date - 2021-05-09T05:10:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising