ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఉపాధి’ నిధులు వినియోగించుకోండి

ABN, First Publish Date - 2021-10-22T05:07:55+05:30

జిల్లాలోని ఉపాధి హామీ మెటీరియల్‌ కాంపొనెంట్‌ నిధులు అధికంగా ఉన్నాయని, వాటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సీఎం జగన్‌ ఆదేశించారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌, జేసీలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లకు సీఎం ఆదేశాలు 

కలెక్టరేట్‌: జిల్లాలోని ఉపాధి హామీ మెటీరియల్‌ కాంపొనెంట్‌  నిధులు అధికంగా ఉన్నాయని, వాటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సీఎం జగన్‌ ఆదేశించారు.  గురువారం జిల్లా కలెక్టర్లతో   వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెటీరియల్‌ కాంపొనెంట్‌ నిధులు మార్చిలోగా ఖర్చు చేయాల్సి ఉన్నందున,  అభివృద్ధి పనులు చేపట్టేందుకు వీలుగా ప్రతిపాదనలు రూపొందించాలని తెలిపారు. శాశ్వత భూహక్కు-భూరక్ష పథకం కింద పైలెట్‌ ప్రాజె క్టుగా ఎంపిక చేసిన 51 గ్రామాల్లో తొలివిడతగా నవంబరులో భూముల రిజిస్ట్రేషన్‌ కూడా ప్రారంభిస్తామని వెల్లడించారు. ఆయా గ్రామాల్లో భూ సర్వేకు సంబంధించిన పనులన్నీ పూర్తి చేసి రిజిస్ట్రేషన్‌ కార్యాలయా లకు పంపించాలని సూచించారు. పంట భూములకు సంబంధించి ఇ-క్రాపు నమోదుపై దృష్టి పెట్టాలని చెప్పారు. గ్రామ సచివాలయాల్లో మౌలిక, కమ్యూనికేషన్‌ సదుపాయాలు మెరుగుపరచాలని సీఎం ఆదేశించారు.  కార్యక్రమంలో  కలెక్టర్‌ సూర్యకుమారి, జేసీలు కిషోర్‌ కుమార్‌, మహేష్‌ కుమార్‌, డీఆర్‌డీఏ పీడీ అశోక్‌ కుమార్‌ ఉన్నారు. 

 

Updated Date - 2021-10-22T05:07:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising