ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫీజుల వసూలుకు ఏకరూప విధానం

ABN, First Publish Date - 2021-02-02T04:52:30+05:30

ప్రైవేటు పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో ఫీజుల వసూలులో ప్రత్యేక విధానం తీసుకొస్తామని, ఇక నుంచి ఏకరూపంగా ఫీజుల విధానం ఉంటుందని పాఠశాల విద్యా నియంత్రణ, పరిశీలన కమిషన్‌ సభ్యుడు వి.నారాయణరెడ్డి, సీఏవీ ప్రసాద్‌ అన్నారు

మాట్లాడుతున్న సభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

త్వరలోనే కార్యాచరణ 

 ఫిర్యాదులకు టోల్‌ ఫ్రీ నెంబర్‌కు 91503 81111

విద్యార్థులకు 30 శాతం రాయితీ ఇవ్వాల్సిందే

పాఠశాల విద్యా నియంత్రణ, పరిశీలన కమిషన్‌ సభ్యులు

కలెక్టరేట్‌, ఫిబ్రవరి 1: ప్రైవేటు పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో ఫీజుల వసూలులో ప్రత్యేక విధానం తీసుకొస్తామని, ఇక నుంచి ఏకరూపంగా ఫీజుల విధానం ఉంటుందని పాఠశాల విద్యా నియంత్రణ, పరిశీలన కమిషన్‌ సభ్యుడు వి.నారాయణరెడ్డి, సీఏవీ ప్రసాద్‌ అన్నారు. జిల్లా పర్యటనకు సోమవారం వచ్చిన ఆయన ముందుగా విజయనగరం మండల పరిధిలోని మల్లిచర్ల జిల్లా పరిషత్‌ పాఠశాలను సందర్శించారు. అనంతరం జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పాఠశాల, జూనియర్‌ కళాశాలల్లో విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు.. వసతుల కల్పనకు, విద్యలో నాణ్యత మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోం దన్నారు. 13 జిల్లాల్లో ఉన్న జూనియర్‌ కళాశాలలు, పాఠశాలలను దశల వారీగా తనిఖీ చేస్తామని తెలిపారు. రానున్న రోజుల్లో ఏకరూప ఫీజుల విధానం అమల్లోకి తీసుకువస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్‌, అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో ఒకే ఫీజు విధానం అమలు చేస్తామన్నారు. పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో తల్లిదండ్రుల కమిటీ ఉండేలా ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. పాఠశాలల్లో సమస్యలపై నేరుగా టోల్‌ ఫ్రీ నెంబర్‌కు 9150381111  ఫోన్‌ లేదా మెయిల్‌లో  ఫిర్యాదులు చేయవచ్చని తెలిపారు. కొవిడ్‌ నేపథ్యంలో 30 శాతం ఫీజు రాయితీ ఇవ్వాలని, లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో డీఈవో నాగమణి, ఉప విద్యాశాఖ అధికారులు ఉన్నారు.


Updated Date - 2021-02-02T04:52:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising