ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖ ఘటనతో గంట్యాడలో విషాద ఛాయలు

ABN, First Publish Date - 2021-04-15T05:30:00+05:30

విశాఖ పట్టణం జిల్లా మధురువాడలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అను మానాస్పద స్థితిలో మృతి చెందడంతో వారి సృగ్రామమైన గంట్యాడలో విషాద ఛాయలు అలముకున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  ఒకే కుటుంబంలో నలుగురు అనుమానాస్పద మృతి

 గంట్యాడ, ఏప్రిల్‌ 15: విశాఖ పట్టణం జిల్లా మధురువాడలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అను మానాస్పద స్థితిలో మృతి చెందడంతో వారి సృగ్రామమైన గంట్యాడలో విషాద ఛాయలు అలముకున్నాయి. గంట్యాడ మాజీ సమితి అధ్యక్షుడు, దివంగత నేత సుంకరి శ్రీరాములునాయుడి నాలుగో కుమారుడు సుంకరి బంగారునాయుడు, తన కుటుంబీకులతో విశాఖ పట్టణంలోని మధురువాడలో నివశిస్తున్నారు. బంగారునాయుడు(49) పదో తరగ తి వరకూ గంట్యాడలోనే చదువుకున్నారు. తరవాత వివిధ ప్రాంతాల్లో ఉన్నత విద్యనభ్య సించారు. ఉద్యోగ రీత్యా డెహ్రాడూన్‌లో 25 ఏళ్లు ఉన్నారు. గత కొద్ది సంవత్సరాల నుంచి విశాఖపట్టణంలో ఉంటున్నారు. ఈయనకు భార్య నిర్మళ (44), ఇద్దరు కుమారులు దీపక్‌(21), కశ్యప్‌(19) ఉన్నారు. వీరు స్వగ్రామమైన గంట్యాడకు పండగ సమమంలో వచ్చి వెళ్తుంటారు. గత నెల 21న గ్రామంలో జరిగిన ఎల్లమాంబ సిరిమానోత్సవానికి వచ్చి వెళ్లారు. అయితే  బుధవారం రాత్రి ఇంటిలో నలుగురు అనుమానాస్పద రీతిలో మృతి చెందడంతో గంట్యాడలో విషాద ఛాయ లు అలముకున్నాయి. గంట్యాడలో అంత్యక్రియలు నిర్వహించడానికి వారి కుటుం బీకులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

 

Updated Date - 2021-04-15T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising