ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రామతీర్థంలో సంప్రదాయబద్ధంగా శ్రీరామనవమి

ABN, First Publish Date - 2021-04-16T04:53:33+05:30

రు. గురువారం ఏర్పాట్లపై అధికారులు, ఆలయ అర్చకులతో సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ కొవిడ్‌ నిబంధనలు పాటిస్తునే సీతారా

మాట్లాడుతున్న కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50




పరిమిత సంఖ్యలో భక్తులకు అనుమతి

కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ 

కలెక్టరేట్‌: రామతీర్థంలో సంప్రదాయబద్ధంగా శ్రీరామనవమి ఉత్సవాలను జరిపించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ ఆదేశించారు. గురువారం ఏర్పాట్లపై అధికారులు, ఆలయ అర్చకులతో సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ కొవిడ్‌ నిబంధనలు పాటిస్తునే సీతారామ కల్యాణాన్ని శాస్త్రోక్తంగా  నిర్వహించాని సూచించారు. ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాలన్నారు. కొవిడ్‌ దృష్ట్యా పరిమిత సంఖ్యలో భక్తులకు అనుమతించాలని సూచించారు. ఈ ఏడాది ఆలయం లోపలే కల్యాణం జరిపించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. కల్యాణాన్ని భక్తులు తిలకించే వీలుగా ప్రత్యక్ష ప్రసారం చేయాలన్నారు.  దీనిపై విసృత్తంగా ప్రచారం చేయాలని సూచించారు. ఉత్సవాల్లో కొవిడ్‌ నిబంధనలు తప్పసరిగా పాటించాలని, ఽథర్మల్‌ స్కానర్‌, మాస్కులు, గ్లౌజులు , శానీటైజర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తులు మధ్య తప్పసరిగా భౌతిక దూరాన్ని పాటించాలన్నారు. క్యూలైన్లలో హైపోక్లోరైడ్‌ను తరుచూ స్ర్పే చేయాలని సూచించారు. ప్రఽథమ చికిత్స కేంద్రాన్ని, తాగునీరు సదుపాయం కల్పించాలని చెప్పారు. సమావేశంలో డీఆర్‌వో గణపతిరావు, ఆర్‌డీవో భవానీశంకర్‌ , దేవాదాయ శాఖ ఉప కమిషనర్‌ జ్యోతి మాధవి , నెల్లిమర్ల తహసీల్దార్‌ రాము, మునిసిపల్‌ కమిషనర్‌ అప్పలనాయుడు, ఎంపీడీవో రాజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.




Updated Date - 2021-04-16T04:53:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising