ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పర్యాటకులను ఆకర్షించేలా టూరిజం ప్యాకేజీ

ABN, First Publish Date - 2021-08-26T05:16:52+05:30

పర్యాటకులను ఆకర్షించేందుకు జిల్లాలోని ఆలయాల ను కలుపుతూ , టూరిజం ప్యాకేజీ ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ సూర్యకుమారి ఆదేశించారు.

మాట్లాడుతున్న కలెక్టర్‌ సూర్యకుమారి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అధికారులకు కలెక్టర్‌ సూర్యకుమారి ఆదేశం

కలెక్టరేట్‌, ఆగస్టు 25: పర్యాటకులను ఆకర్షించేందుకు జిల్లాలోని ఆలయాల ను కలుపుతూ , టూరిజం ప్యాకేజీ ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ సూర్యకుమారి ఆదేశించారు. బుధవారం సాయంత్రం తన చాంబర్‌లో ఆయా శాఖాధికారులతో మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలోని పైడితల్లమ్మ ఆలయం, రాజమన్నార్‌ రాజగోపాల స్వామి ఆలయం, రామనారాయణం , విజయనగరం కోట, మహారాజ ప్రభుత్వ సంగీత కళాశాల, గురజాడ అప్పారావు స్మారక గృహం , బౌద్ధ ఆరామం, గురు భక్తుల కొండ, రామతీర్థం , కుమిలి దేవాలయాలు.. తదితర ప్రాంతాలను కలు పుతూ పర్యాటక ప్యాకేజీ రూపొందించాలని చెప్పారు. విశాఖ నుంచి టూరిజం బస్సులో పర్యాటకులను ఇక్కడకు తీసుకొచ్చి వచ్చి ఈ ప్రదేశాలను చూపించా లన్నారు. దీనికోసం వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేసి అనుమతులు తీసుకోవా లన్నారు. ఆ తరువాత మరిన్ని ప్రాంతాలకు ఈ ప్యాకేజీని విస్తరించాలని  సూచిం చారు. దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌ పుష్పవర్దన్‌, జిల్లా పర్యాటక శాఖ అధికారి లక్ష్మీనారాయణ, మాన్సాస్‌ ఈవో వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు. 


 

Updated Date - 2021-08-26T05:16:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising