ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొట్టక్కిలో టూరిజం హబ్‌

ABN, First Publish Date - 2021-11-27T04:55:23+05:30

వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖలో వారంతా 30 నుంచి 40 ఏళ్ల పాటు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. కీలకమైన చెక్‌పాయింట్లలో రాత్రి పూట విధులు నిర్వహించి సంస్థకు ఎంతో ఆదాయాన్ని తీసుకువచ్చారు. విధుల్లో ఉన్నంత కాలం అంకితభావంతో కష్టపడ్డారు. పదవీ విరమణ తరువాత అధికారులు తమ పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించడాన్ని వారు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు

విజయనగరం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కార్యాలయం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్‌

రామభద్రపురం, నవంబరు 26: కొట్టక్కి రెవెన్యూ పరిధిలో టూరిజం హబ్‌ ఏర్పాటు చేయడానికి  అధికారులు మొగ్గు చూపుతున్నారు. ఇక్కడి స్థలాన్ని కలెక్టర్‌ సూర్యకుమారి శుక్రవారం పరిశీలించారు. అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములపై ఆరా తీశారు. ఇక్కడ టూరిజం హబ్‌ ఏర్పాటు చేసి తోణాం, దండిగాం ప్రాంతాల్లో ఉన్న వాటర్‌ ఫాల్స్‌, పర్యాటక ప్రదేశాలను చూపించడానికి అవకాశం ఉంటుందని ఐటీడీఏ పీవో కూర్మనాథ్‌ సూచించారు. దీంతో ఈ భూములను కలెక్టర్‌ పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జిల్లాలో పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే యోచనలో ఉన్నామని చెప్పారు. ఇందులో భాగంగా ప్రసిద్ధికెక్కిన పర్యాటక కేంద్రాలను గుర్తిస్తున్నామన్నారు. కొట్టక్కికి చెందిన రైతులు కలెక్టర్‌కు గోడు వినిపించారు. ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ డీపట్టా భూములు సాగుచేసుకొని పంటలు పండించుకుంటున్నామని చెప్పారు. ఈ భూములు తీసుకొని తమ పొట్ట కొట్టవద్దని కోరారు. కలెక్టర్‌ వెంట సాలూరు తహసీల్దార్‌ కోరాడ శ్రీనివాసరావు, రామభద్రపురం ఎంపీడీవో ఉషారాణి, ఈవోపీఆర్‌డీ జ్ఞానేశ్వరరావు తదితరులు ఉన్నారు. 

మెంటాడలోనే గిరిజన  వర్సిటీ?

ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న గిరిజన యూనివర్సిటీకి స్థల పరిశీలన పూర్తయినట్టు కలెక్టర్‌ సూర్యకుమారి తెలిపారు. మెంటాడ ప్రాంతంలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయవచ్చునని సూచనప్రాయంగా తెలిపారు. 

---------------

Updated Date - 2021-11-27T04:55:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising