ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ విద్యార్థులు ‘బంగారం’

ABN, First Publish Date - 2021-01-24T05:54:55+05:30

మండలంలోని పెదమేడపల్లి మో డల్‌ స్కూల్‌ విద్యార్థులు మరోసారి తమ పాఠశాల కీర్తిని రాష్ట్రస్థాయిలో రెపరెపలాడించారు. ఇద్దరు విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీల్లో బంగారం పతకాలు సాధించి తమ సత్తాచాటారు.

విజేతలను అభినందిస్తున్న డీఈవో నాగమణి, తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీల్లో  ఇద్దరికి పసిడి పతకాలు

మరోసారి పెదమేడపల్లి మోడల్‌ స్కూల్‌ విద్యార్థుల ప్రతిభ

అభినందించిన డీఈవో నాగమణి

మెంటాడ : మండలంలోని పెదమేడపల్లి మో డల్‌ స్కూల్‌ విద్యార్థులు మరోసారి తమ పాఠశాల కీర్తిని రాష్ట్రస్థాయిలో రెపరెపలాడించారు. ఇద్దరు విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీల్లో బంగారం పతకాలు సాధించి తమ సత్తాచాటారు. గుంటూరు ఆచార్య నాగార్జున వర్సిటీ వేదికగా ఈ నెల 19 నుంచి 21 వరకు జరిగిన 34వ రాష్ట్ర జూనియర్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో మోడల్‌ స్కూల్‌ విద్యార్థి ఎం.వెంకటరమణ అండర్‌-18 విభాగంలో 1500 మీటర్ల పరుగులో బంగారు పతకం సాధించాడు. కె.కృష్ణవేణి 5000 మీటర్ల రేస్‌వాక్‌లో ప్రతిభ చూపి పసిడి పతకాన్ని సాధించింది. వీరిద్దరూ ఇండియా అథ్లెటిక్స్‌ కోచ్‌, ద్రోణాచార్య అవార్డు గ్రహీత రమేష్‌ నుంచి ఈ పతకాలు అందుకున్నారు. ఈ మేరకు శనివారం విజయ నగరంలో డీఈవో నాగమణిని వీరితోపాటు రామభ ద్రపురం కేజీబీవీ విద్యార్థిని మాణ్యశ్రీ (జావెలన్‌ త్రోలో కాంస్య పతకం), షాట్‌ఫుట్‌లో పాల్గొన్న పెద మేడపల్లి మోడల్‌స్కూల్‌ విద్యార్థిని కలిశారు. ఈ సందర్భంగా డీఈవో వారిని అభినందించి భవిష్యత్తు లో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ సుమంత్‌, ఫిజికల్‌ డైరెక్టర్‌ సీహెచ్‌ రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-24T05:54:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising