ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్టీసీ సిబ్బంది తీరు అమానుషం

ABN, First Publish Date - 2021-02-24T05:32:26+05:30

వృద్ధదంపతులపై కనీసం మానవత్వం లేకుండా ఆర్టీసీ సిబ్బంది ప్రవర్తించిన తీరు అమానుషమని లోక్‌సత్తా నాయకుడు ఆకుల దామోదరరావు మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  జిల్లా న్యాయమూర్తికి ఫిర్యాదు చేస్తాం 

  లోక్‌సత్తా నాయకుడు ఆకుల 

బొబ్బిలి (రామభద్రపురం), ఫిబ్రవరి 23:  వృద్ధదంపతులపై కనీసం మానవత్వం లేకుండా ఆర్టీసీ సిబ్బంది ప్రవర్తించిన తీరు అమానుషమని లోక్‌సత్తా నాయకుడు ఆకుల దామోదరరావు మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. సాలూరు పట్టణం బంగారమ్మకాలనీకి చెందిన దాసరి పైడియ్య (62) మార్గ మధ్య ఆర్టీసీ బస్సులో మృతి చెందగా, ఈ పరిస్థితుల్లో బాధ్యతగా వ్యవహరించాల్సిన ఆర్టీసీ బస్సు డ్రైవర్‌, కండక్టర్‌ బొబ్బిలి పెట్రోల్‌ బంకు సమీపంలో దింపేయడం అమానుషమని మండిపడ్డారు. ఈ ఘటనపై జిల్లా న్యాయమూర్తికి ఫిర్యాదు చేయనున్నట్టు చెప్పారు. ఇది మానవ హక్కుల ఉల్లంఘణే అవుతుందన్నారు. బాధ్యులైన డ్రైవర్‌, కండక్టర్లపై చట్టపరమైన చర్య లు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. సమావేశంలో పొట్నూరు లక్ష్మి, వినియోగదారుల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు ముప్పాళ్ల నర్సింగరావు, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ దాసరి సురేష్‌ పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-02-24T05:32:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising