ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2021-07-25T05:45:28+05:30

కలవచర్ల గ్రామానికి చెందిన నడుపూరు అప్పలనాయుడు (35) శుక్రవారం రాత్రి అనుమానా స్పదంగా మృతి చెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 గుర్ల: కలవచర్ల గ్రామానికి చెందిన నడుపూరు అప్పలనాయుడు (35) శుక్రవారం రాత్రి అనుమానా స్పదంగా మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి. అప్ప లనాయుడు శుక్రవారం సాయంత్రం తన అత్తవారి గ్రా మమైన దమరసింగి వెళ్తానని ఇంట్లో చెప్పి బయ లుదేరారు. అయితే అదే రోజు అర్ధరాత్రి అత్తింటివారు ఆయన మృతదేహాన్ని కలవచర్ల తీసుకొచ్చారు. కాగా తన కొడుకు, కోడలు తరచూ గొడవలు పడుతుండేవా రిని, అత్తంటివారే తన కుమారుడిని హత్యచేశారని అప్పలనాయుడి తల్లి రాములమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఇదిలాఉండగా శుక్రవారం రాత్రి ఫోన్‌చేసి... ఎస్‌ఎస్‌ఆర్‌ పేట సమీపంలో రైల్వే ట్రాక్‌ వద్ద ఉన్నాన ని, ఇక్కడే చనిపోతానని చెప్పాడని అప్పలనాయుడి భార్య శాంతి పోలీసులకు చెప్పింది. రైల్వే ట్రాక్‌ వద్ద తన భర్త పడి ఉన్నట్టు తెలుసుకున్నామని, వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని, ఆయన్ని ఆసుపత్రికి తరలిస్తుండగా నెల్లిమర్ల దాటిన తర్వాత మృతిచెందారని శాంతి తెలిపింది. గుర్ల ఎస్‌ఐ ఘటనా స్థలాన్ని పరిశీలించి, ఈ కేసు రైల్వే పోలీసుల పరిధిలోకి వస్తుందని చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీపురుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పల నాయుడికి భార్య, ఇద్దరు చిన్నారులు, ఐదుగురు అక్కచెలెళ్లు ఉన్నారు. గుర్ల పోలీ సు స్టేషన్‌ వద్దకు మూడు గ్రామాలు దమరసింగి, కలవచర్ల, జమ్ము గ్రామాలకు చెందినవారు రావడంతో ఆ ప్రాంతంలో జనాలతో కిక్కిరిసిపోయింది. 

 

Updated Date - 2021-07-25T05:45:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising