ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నవధాన్యాల సాగుతో భూమి సారవంతం

ABN, First Publish Date - 2021-04-21T04:57:43+05:30

నవధాన్యాల సాగుతో భూసారం పెరుగు తుందని వ్యవ సాయశాఖ విజయనగరం డీపీఎం కె.ప్రకాష్‌ తెలిపారు. కేసలి గ్రామంలో మంగళవారం నవధాన్యాలపై రైతులకు అవగాహన కల్పించారు.

బాడంగి : నవధాన్యాల సాగుపై అవగాహన కల్పిస్తున్న అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 పాచిపెంట, ఏప్రిల్‌ 20: నవధాన్యాల సాగుతో భూసారం పెరుగు తుందని వ్యవ సాయశాఖ విజయనగరం డీపీఎం కె.ప్రకాష్‌ తెలిపారు. కేసలి గ్రామంలో మంగళవారం నవధాన్యాలపై రైతులకు అవగాహన కల్పించారు. నవధాన్యాల సాగుతో భూమి చీడ పీడలను తట్టుకుంటుందని చెప్పారు. నేల గుల్ల బారి వానపాములు వృద్ధి చెందుతాయని చెప్పారు. నేలలో నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుందన్నారు. మేలో వేసిన నవధాన్య పంటలు మొలకెత్తి పూతకు వచ్చేటప్పటికీ సుమారు 45 నుంచి 50 రోజుల కాలం పడుతుందన్నారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారులు హేమ సుందర్‌, బి.గోవిందరావు, వీఏఏ రాకేష్‌, ఐసీఆర్‌పీ గంగరాజు పాల్గొన్నారు. సాలూరు(మక్కువ): నవధాన్యాల సాగుతో నేలతల్లికి జీవం పోయాలని జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్‌ కె.ప్రకాష్‌ అన్నారు.   దుగ్గేరులో నవధాన్యాల సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమాన్ని   నిర్వహించారు. నవధాన్యాల సాగుతో భూమిలో జీవ వైవిధ్యం, నేలలో సేంద్రియ కర్బన్‌ శాతం పెరుగుతుందన్నారు. 18 నుంచి 21 రకాల విత్తనాలను భూమిలో వేసి కలియదున్నటం వల్ల కలిగే లాభాలను   వివ రించారు. ప్రకృతి వ్యవసాయాధికారి హేమసుందర్‌, ఏవో కొల్లి తిరుపతిరావు, రైతులు పాల్గొన్నారు. బాడంగి: గజరాయనివలస రైతులకు ఏవో గోకుల్‌కృష్ణ  చిరు ధాన్యాల సాగుపై అవగాహన కల్పించారు. 18 రకాలైన పప్పు ధాన్యాలు సాగుచేస్తే భూమి సారవంతమవుతుందని చెప్పారు.  పంట మార్పిడి  వల్ల   పంటకు కావాల్సిన అన్ని రకాల పోషకాలు అందుతాయని చెప్పారు.   రైతులు ఈశ్వరరావు, సర్పంచ్‌ సత్యనారాయణ, వలంటీర్లు పాల్గొన్నారు. 


 

Updated Date - 2021-04-21T04:57:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising