ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈదురుగాలుల బీభత్సం!

ABN, First Publish Date - 2021-04-19T04:57:30+05:30

నుంచి తీక్షణమైన ఎండతో ప్రజలు విలవిల్లాడిపోయారు. మధ్యాహ్నం 3 గంటల తరువాత ఒక్కసారిగా మేఘాలు కమ్ముకున్నాయి. మెరుపులు, ఉరుములు ప్రారంభమయ్యాయి. ఈదురుగాలులు వీచాయి. కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. విజయనగరంలో దట్టమైన మేఘాలు కమ్ము

ఈదురుగాలులకు నేలకొరిగిన మామిడి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50




ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ ఎండ

సాయంత్రానికి ఉరుములు, మెరుపులు

విజయనగరం (ఆంధ్రజ్యోతి)/సీతానగరం/గంట్యాడ/వేపాడ/బాడంగి

జిల్లాలో ఆదివారం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఉదయం నుంచి తీక్షణమైన ఎండతో ప్రజలు విలవిల్లాడిపోయారు. మధ్యాహ్నం 3 గంటల తరువాత ఒక్కసారిగా మేఘాలు కమ్ముకున్నాయి. మెరుపులు, ఉరుములు ప్రారంభమయ్యాయి. ఈదురుగాలులు వీచాయి. కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. విజయనగరంలో దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. భారీ వర్షం పడుతుందని భావించినా..చిరుజల్లులు పడడంతో నగరవాసులు సేదతీరారు.  ఈదురుగాలులకు బాడంగి మండలం ఆకులకట్ట, రామచంద్రాపురం, వాడాడ, కోటిపల్లిలో మామిడి పంటకు అపార నష్టం కలిగింది.  


పిడుగుపాటుకు వ్యక్తి మృతి

పిడుగుపడి సీతానగరం మండలం నిడగల్లు  గ్రామానికి చెందిన బర్ల దాలినాయుడు (45) మృతిచెందాడు. ఆదివారం పశువులను మేత కోసం మాకినాయుడు చెరువు వద్దకు తీసుకెళ్లాడు. సాయంత్రం ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. ఆ సమయంలో పిడుగు పడడంతో దాలినాయుడు మృతిచెందాడు. స్థానికులు గమనించి కుటుంబసభ్యులకు సమాచారమందించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనతో నిడగల్లులో విషాదం అలుముకుంది. 


12 గొర్రెలు మృత్యువాత

పిడుగుపాటుకు బుడతనాపల్లిలో 12 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. గ్రామానికి చెందిన పైడిరాజు గొర్రెలను మేత కోసం ఆదివారం సాయంత్రం పొలాలకు తీసుకెళ్లాడు. సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. ఆ సమయంలో పిడుగు పడడడంతో గొర్రెలు మృతిచెందాయి. దీంతో బాధితుడు కన్నీరుమున్నీరవుతున్నాడు. 


తప్పిన ప్రమాదం

వేపాడ మండలం జాకేరులో ప్రమాదం తప్పింది. ఆదివారం సాయంత్రం వీచిన ఈదురుగాలులకు పాఠశాల వద్ద ఉన్న స్తంభం విరిగిపోయింది. పాఠశాల భవనాలపై పడింది. ఆదివారం సెలవు కావడంతో అక్కడ విద్యార్థులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. స్తంభం శిథిలావస్థకు చేరుకున్నా మార్చకపోవడంతో ఘటన చోటుచేసుకుంది.  గ్రామస్థులు విద్యుత్‌ శాఖ అధికారులకు సమాచారమందించారు. దీంతో వారు సరఫరా నిలిపివేసి స్తంభాన్ని మార్చడానికి చర్యలు చేపడుతున్నారు.  



Updated Date - 2021-04-19T04:57:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising