ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీఎస్‌ఎన్‌ఎఫ్‌ నేతల అరెస్టు సరికాదు

ABN, First Publish Date - 2021-01-24T05:39:14+05:30

పేదలకు ఉన్నత విద్యను దూరం చేసే జీవో 77 రద్దు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించిన టీఎస్‌ఎన్‌ఎఫ్‌ నేతలను అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తు న్నామని టీఎస్‌ఎన్‌ఎఫ్‌ పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి మాడుగుల భానుప్రకాష్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం రూరల్‌, జనవరి 23: పేదలకు ఉన్నత విద్యను దూరం చేసే జీవో 77 రద్దు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించిన టీఎస్‌ఎన్‌ఎఫ్‌ నేతలను అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తు న్నామని టీఎస్‌ఎన్‌ఎఫ్‌ పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి మాడుగుల భానుప్రకాష్‌ అన్నారు. శనివారం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పీజీ కళాశాలలో విద్యను అభ్యసించే పేద, బడుగు, బలహీన వర్గాలకు విద్యను దూరం చేసే జీఓ నెంబరు 77 రద్దు చేసేంత వరకూ పోరాటం కొనసాగుతుందన్నారు.  టీఎస్‌ ఎన్‌ఎఫ్‌ ప్రతినిధులు చైతన్యబాబు, గొలగాని సురేంద్ర, షేక్‌ భాషా, ప్రణయ్‌, రాజినాయుడు పాల్గొన్నారు. 

బొబ్బిలి: పేదలకు ఉన్నత విద్యను దూరం చేసే జీఓ 77 ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ అమరావతిలో ఆందోళన చేపట్టిన రాష్ట్ర టీఎన్‌ఎస్‌ఎఫ్‌ అధ్యక్షుడు ఎంవీ ప్రణవ్‌ గోపాల్‌ను అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నట్లు విజయనగరం పార్లమెంట్‌ నియోజకవర్గ టీఎన్‌ఎస్‌ఎఫ్‌ సభ్యులు సాయిహేమంత్‌, సంతు, నాగరాజు తదితరులు తెలిపారు. ప్రభుత్వం తన నియంతృత్వ పోకడలను విడనాడాలని డిమాండ్‌ చేశారు.


Updated Date - 2021-01-24T05:39:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising