ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పార్వతీపురంలో ఉద్రిక్తం

ABN, First Publish Date - 2021-10-21T04:50:29+05:30

వైసీపీ దాడులకు నిరసనగా పార్వతీపురంలో టీడీపీ శ్రేణులు బుధవారం ఆందోళన వ్యక్తం చేశాయి. పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఒకానొక దశలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు ఇంటికి బుధవారం ఉదయమే రూరల్‌, పట్టణ ఎస్‌ఐలు కళాధర్‌, వీరబాబులు సిబ్బందితో వెళ్లి వారిని హౌస్‌ అరెస్టు చేశారు.

మాజీ ఎమ్మెల్సీ జగదీష్‌ను అరెస్టు చేస్తున్న పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పార్వతీపురం, అక్టోబరు 20 : వైసీపీ దాడులకు నిరసనగా పార్వతీపురంలో టీడీపీ శ్రేణులు బుధవారం ఆందోళన వ్యక్తం చేశాయి. పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఒకానొక దశలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు ఇంటికి బుధవారం ఉదయమే రూరల్‌, పట్టణ ఎస్‌ఐలు కళాధర్‌, వీరబాబులు సిబ్బందితో వెళ్లి వారిని హౌస్‌ అరెస్టు చేశారు. బంద్‌కు మద్దతుగా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పార్టీ కార్యాలయమైన జగదీష్‌ ఇంటికి చేరుకోగా వారిని కూడా పోలీసులు కదలనివ్వలేదు. అయినప్పటికీ పోలీసుల వలయాలను ఛేదించుకుని అందరూ రోడ్డుపైకి వచ్చారు. రహదారిపై కూర్చొని ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తోపులాటల మధ్య వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జగదీష్‌, చిరంజీవులను అరెస్టు చేసి పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు దొగ్గ మోహన్‌, ప్రదీప్‌, జాగాన రవిశంకర్‌, కోలా వెంకటరావు, బార్నాల సీతారాం, గుంట్రెడ్డి రవికుమార్‌, కె.నారాయణరావు, బోను దేవీచంద్రమౌళి, గొట్టాపు వెంకటనాయుడు, రెడ్డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2021-10-21T04:50:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising