ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతికి టీడీపీ నేతలు

ABN, First Publish Date - 2021-02-25T04:41:53+05:30

కొత్తవలస పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ మద్దతు అభ్యర్థికి జరిగిన అన్యాయంపై ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేయడానికి టీడీపీ నేతలు సమాయత్తమయ్యారు. పోటీ చేసిన బోని తిరుపతిరావు, మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, టీడీపీ మండల అధ్యక్షుడు కోళ్ల వెంకటరమణ, కొత్తవలస మాజీ సర్పంచ్‌ గొరపల్లి రాము, కొత్తవలస పీహెచ్‌సీ మాజీ చైర్మన్‌ కనకాల శివతదితరులు బుధవారం అమరావతికి బయలుదేరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్తవలస ఘటనపై ఫిర్యాదుకు సమాయత్తం

కొత్తవలస , ఫిబ్రవరి 24:  కొత్తవలస పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ మద్దతు అభ్యర్థికి జరిగిన అన్యాయంపై ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేయడానికి టీడీపీ నేతలు సమాయత్తమయ్యారు. పోటీ చేసిన బోని తిరుపతిరావు, మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, టీడీపీ మండల అధ్యక్షుడు కోళ్ల వెంకటరమణ, కొత్తవలస మాజీ సర్పంచ్‌ గొరపల్లి రాము, కొత్తవలస పీహెచ్‌సీ మాజీ చైర్మన్‌ కనకాల శివతదితరులు బుధవారం అమరావతికి బయలుదేరారు. ఫలితాన్ని తారుమారు చేసి వైసీపీ అభ్యర్థి గెలిచినట్టు ప్రకటించినరిటర్నింగ్‌ అధికారిపై చర్యలు తీసుకోవాలని వారంతా డిమాండ్‌ చేస్తున్నారు. పోలింగ్‌ నాటి నుంచి రీకౌంటింగ్‌ చేయాలని ఎన్నిసార్లు వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోకపోవడంతో చివరకు ఎస్‌ఈసీకి ఫిర్యాదు చేయడానికి బుధవారం పయనమయ్యారు. 

ఓట్ల లెక్కింపులో జరిగిన అన్యాయంపై తెలుగుదేశం మద్దతుదారులు గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న నిరసన శిబిరాన్ని తహసీల్దార్‌ కార్యాలయం సమీపం నుంచి మాజీ సర్పంచ్‌ గొరపల్లి రాము స్థలంలోకి మార్పు చేశారు. శిబిరాన్ని తీయకపోతే కేసులు పెడతామని తహసీల్దార్‌ సురేష్‌, సీఐ గోవిందరావు హెచ్చరించడంతో బుధవారం శిబిరాన్ని మార్చారు. 

రీకౌంటింగ్‌ చేయకపోవడంపై మనస్థాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినకొత్తవలస తెలుగుదేశం పార్టీ జడ్పీటీసీ అభ్యర్ధి గొరపల్లి సుజాతపై కొత్తవలస పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటన జరిగినప్పుడు ఆమెను ఇంటికి పంపించిన తరువాత కొత్తవలస సీఐ జి.గోవిందరావు ఆమెపై కేసు నమోదు చేశారు. 

కొత్తవలస జంక్షన్‌లో ఆందోళన చేయడం ద్వారా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారంటూ కొత్తవలస పోలీసులు మాజీ సర్పంచ్‌ గొరపల్లి రాము మరో 10 మందిపై కేసు నమోదు చేశారు.


Updated Date - 2021-02-25T04:41:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising