ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరో భూసేక‘రణం’!

ABN, First Publish Date - 2021-09-04T04:25:31+05:30

వరుస భూసేకరణలతో ఆందోళనకు గురవుతున్న కొత్తవలస మండల రైతులకు మరో పిడుగులాంటి వార్త. హెచ్‌పీసీఎల్‌ పైపులైన్‌ నిర్మాణానికి సంబంధించి అవసరమైన భూసేకరణకు సహకరించాలని స్థానిక రెవెన్యూ అధికారులకు ఆదేశాలొచ్చాయి.

రామలింగపురంలో సర్వేకు సిద్ధం చేసిన దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50




తెరపైకి హెచ్‌పీసీఎల్‌ పైపులైన్‌ నిర్మాణం

గ్రామాల్లో ప్రారంభమైన సర్వే

కొత్తవలస,  సెప్టెంబరు 3: వరుస భూసేకరణలతో ఆందోళనకు గురవుతున్న కొత్తవలస మండల రైతులకు మరో పిడుగులాంటి వార్త. హెచ్‌పీసీఎల్‌ పైపులైన్‌ నిర్మాణానికి సంబంధించి అవసరమైన భూసేకరణకు సహకరించాలని స్థానిక రెవెన్యూ అధికారులకు ఆదేశాలొచ్చాయి. ఈ మేరకు గ్రామాల వారీగా సేకరించాల్సిన భూమి వివరాల జాబితా తహసీల్దారు రమణారావుకు అందింది. ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచి గ్రామాల్లో సర్వే పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే గ్రీన్‌ఫీల్డ్‌ జాతీయ రహదారి, ఐవోసీ పైప్‌లైన్‌, పోలవరం ఎడమ కాలువ నిర్మాణానికి భూసేకరణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. రైతుల నుంచి నిలదీతలు, అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అదే గ్రామాల్లో హెచ్‌పీసీఎల్‌ పైపులైన్‌ నిర్మాణానికి భూ సేకరణ చేపట్టాల్సి ఉండడం అధికారులకు తలనొప్పిగా మారుతోంది. పోలవరం ఎడమ కాలువ కోసం గులివిందాడ, చీపురువలస,  చీడివలస, రామలింగపురం, దేవాడ గ్రామాలలో భారీగా భూములు సేకరిస్తున్నారు. ఇప్పుడు అదే గ్రామాల్లో మరోసారి సేకరించాల్సి రావడంతో ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొవాల్సి ఉంటుందోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు. 





Updated Date - 2021-09-04T04:25:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising