ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలి

ABN, First Publish Date - 2021-01-26T05:45:47+05:30

స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలు, నా యకులకు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కె.బి.ఎ. రామ్‌ప్రసాద్‌ పిలుపునిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రామ్‌ప్రసాద్‌
కొత్తవలస రూరల్‌(ఎల్‌.కోట), జనవరి 25:
స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని  కార్యకర్తలు, నా యకులకు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కె.బి.ఎ. రామ్‌ప్రసాద్‌ పిలుపునిచ్చారు.  స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఎల్‌.కోటలోని ఆయన నివాసంలో సోమవారం మండల పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా గ్రామాల్లో  ప్రతి ఒక్కరూ  పనిచేయాలని కోరారు.  ప్రజా సంక్షేమానికి టీడీపీ ఎప్పుడూ కట్టుబడి పనిచేసిందని గుర్తుచేశారు. మాజీ జడ్పీటీసీ కరెడ్ల ఈశ్వరరావు, మాజీ ఎమ్పీపీ కొల్లి వెంకటరమణమూర్తి, పార్టీ అధ్యక్షుడు చొక్కాకుల మల్లునాయుడు, వివిధ గ్రామాలకు  చెందిన  నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వేపాడ: ప్రజల్లో గుర్తింపు ఉన్న వ్యక్తులను ఎంపిక చేసు కుని స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని రాష్ట్ర టీడీపీ కార్యవర్గ సభ్యుడు కోళ్ల రాంప్రసాద్‌ పిలుపునిచ్చారు. వే పాడలో సోమవారం మండల పార్టీ అధ్యక్షుడు శానాపతి తా తారావు అధ్యక్షతన పార్టీ నాయకులు, కార్యకర్తలతో విసృత స్థా యి సమావేశం నిర్వహించి మాట్లాడారు. రాష్ట్రంలో దుష్ట పరిపాలన కొనసాగుతోందని, ఈ పాలన అంతానికి స్థానిక ఎన్నికలే నాంది కావాలని సూచించారు. పార్టీ సీనియర్‌ నాయ కుడు, కొత్తవలస వ్యవసాయ కమిటీ మాజీ చైర్మెన్‌ తిక్కాన దేముడు మాట్లాడుతూ చంద్రబాబు చేసిన అభివృద్ధే మనల్ని గెలిపిస్తుందన్నారు.  జిల్లా పార్టీ నాయకుడు గోగాడ జగన్నాఽ థం నాయుడు, నియోజక మహిళా అధ్యక్షురాలు గుమ్మడి భారతి, మాజీ ఎంపీపీ దాసరి లక్షి, మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-26T05:45:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising