ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రాఫిక్‌ నియంత్రణకు పటిష్ట చర్యలు

ABN, First Publish Date - 2021-03-03T04:29:51+05:30

ద్రంతో పాటు అన్ని పట్టణాల్లో ట్రాఫిక్‌ నియంత్రణకు పటిష్ట చర్యలు చేపడుతున్నట్టు ఎస్పీ రాజకుమారి స్పష్టం చేశారు. మంగళవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో రోడ్డు ప్రమాదాల నియంత్రణపై పోలీసు అధికారులు, సిబ్బందితో సమీక్షించారు. ప్రమాదాల నియంత్రణకు సంబంధించిన సామగ్రిని అందించారు. ఎస్పీ మాట్లాడుతూ ట్రాఫిక్‌పై ప్రజ

ట్రాఫిక్‌ నియంత్రణ సామగ్రిని అందజేస్తున్న ఎస్‌పీ రాజకుమారి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50




ఎస్పీ రాజకుమారి

విజయనగరం క్రైం, మార్చి 2: జిల్లా కేంద్రంతో పాటు అన్ని పట్టణాల్లో ట్రాఫిక్‌ నియంత్రణకు పటిష్ట చర్యలు చేపడుతున్నట్టు ఎస్పీ రాజకుమారి స్పష్టం చేశారు. మంగళవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో రోడ్డు ప్రమాదాల నియంత్రణపై పోలీసు అధికారులు, సిబ్బందితో సమీక్షించారు. ప్రమాదాల నియంత్రణకు సంబంధించిన సామగ్రిని అందించారు. ఎస్పీ మాట్లాడుతూ ట్రాఫిక్‌పై ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. జిల్లాలో శాంతిభద్రతల సమస్య లేకున్నా..ట్రాఫిక్‌ సమస్యలు పెరుగుతుండడంపై ఆందోళన వ్యక్తం చేశారు.  సిబ్బంది బాధ్యతగా వ్యవహరించి ఎక్కడికక్కడ ఎదురయ్యే సమస్యలను పరిష్కరించాలన్నారు. ముఖ్యంగా జిల్లా కేంద్రంలో ఇరుకు రహదారులతో ట్రాఫిక్‌ సమస్యలు ఎదురవుతున్నాయి. అయినా సిబ్బంది సాధ్యమైనంతవరకూ పరిష్కరించగలుగుతున్నారని చెప్పారు. విద్యా సంస్థలు, వ్యాపార, వాణిజ్య సంస్థల్లో ట్రాఫిక్‌ నిబంధనలపై ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎస్‌పీ సత్యనారాయణరావు, ఓఎస్‌డీ పూర్ణచంద్రరావు, డీఎస్‌పీలు అనీల్‌కుమార్‌, మోహనరావు, శేషాద్రి,  సీఐలు మురళీ, ఎర్రంనాయుడు, శ్రీధర్‌, రాంబాబు, శ్రీనివాసరావు పాల్గొన్నారు. 





Updated Date - 2021-03-03T04:29:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising