పైడిమాంబకు ప్రత్యేక పూజలు
ABN, First Publish Date - 2021-08-11T04:49:53+05:30
ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి పైడితల్లమ్మని మంగళవారం భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. శ్రావణమాసం తొలి మంగళవారం కావడంతో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఉదయాన్నే మూడు లాంతర్లు వద్దనున్న పైడిమాంబ ఆలయానికి చేరుకున్నారు.
బారులుతీరిన భక్తులు
విజయనగరం రూరల్, ఆగస్టు 10: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి పైడితల్లమ్మని మంగళవారం భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. శ్రావణమాసం తొలి మంగళవారం కావడంతో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఉదయాన్నే మూడు లాంతర్లు వద్దనున్న పైడిమాంబ ఆలయానికి చేరుకున్నారు. సుప్రభాత సేవ అనంతరం అర్చకులు భక్తులకు దర్శనానికి అనుమతించారు. రైల్వే స్టేషన్‌రోడ్డులోని వనంగుడిలోనూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎన్‌సీఎస్ రోడ్డులోని దుర్గాదేవి ఆలయం, పాత బస్టాండ్ రోడ్డులోని అమ్మవారి ఆలయం, రింగురోడ్డులో ఉన్న జ్ఞానసరస్వతి ఆలయం, కన్యకాపరమేశ్వరి ఆలయం, కోట సత్తెమ్మతల్లి తదితర ఆలయాల్లో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పూజలు చేశారు.
Updated Date - 2021-08-11T04:49:53+05:30 IST