ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించండి

ABN, First Publish Date - 2021-07-24T05:33:39+05:30

తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ప్యాఫ్టో) ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఉపాధ్యాయులు పెద్దఎత్తున హాజరయ్యారు. రెవెన్యూ అధికారులకు వినతిపత్రాలు అందించారు. నిరసన కార్యక్రమంలో భాగంగా విజయనగరం ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ప్యాఫ్టో ప్రధాన కార్యదర్శి బుకారిబాబు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. బుకారిబాబు మాట్లాడుతూ మూడు, నాలుగు తరగతులను తరలించే ప్రక్రియ నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. విద్యారంగాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలను మానుకోవాలన్నారు. ఉపాధ్యాయుల పదోన్నతులపై స్పష్టత ఇవ్వాలని కోరారు. సీపీఎస్‌ను తక్షణం రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయ సంఘ నేతలు రమేష్‌చంద్ర పట్నాయక్‌, శ్రీనివాసరావులు మాట్లాడుతూ ఏపీజీఎల్‌ఐసీ, పీఎఫ్‌ రుణాలు తుది చెల్లింపులు సకాలంలో పూర్తి చేయాలని కోరారు. కార్యక్రమంలో ప్యాఫ్టో ప్రతినిధులు సన్యాసిరాజు, అమరనాథ్‌, పి.శ్రీనివాస్‌, శ్యామ్‌ తదితరులు పాల్గొన్నారు.

విజయనగరంలో ఉపాధ్యాయుల నిరసన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


జిల్లా వ్యాప్తంగా ప్యాఫ్టో ఆధ్వర్యంలో నిరసన

విజయనగరం రూరల్‌, జూలై 23: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ప్యాఫ్టో) ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఉపాధ్యాయులు పెద్దఎత్తున హాజరయ్యారు. రెవెన్యూ అధికారులకు వినతిపత్రాలు అందించారు. నిరసన కార్యక్రమంలో భాగంగా విజయనగరం ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ప్యాఫ్టో ప్రధాన కార్యదర్శి బుకారిబాబు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. బుకారిబాబు మాట్లాడుతూ మూడు, నాలుగు తరగతులను తరలించే ప్రక్రియ నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. విద్యారంగాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలను మానుకోవాలన్నారు. ఉపాధ్యాయుల పదోన్నతులపై స్పష్టత ఇవ్వాలని కోరారు. సీపీఎస్‌ను తక్షణం రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయ సంఘ నేతలు రమేష్‌చంద్ర పట్నాయక్‌, శ్రీనివాసరావులు మాట్లాడుతూ ఏపీజీఎల్‌ఐసీ, పీఎఫ్‌ రుణాలు తుది చెల్లింపులు సకాలంలో పూర్తి చేయాలని కోరారు. కార్యక్రమంలో ప్యాఫ్టో ప్రతినిధులు సన్యాసిరాజు, అమరనాథ్‌, పి.శ్రీనివాస్‌, శ్యామ్‌ తదితరులు పాల్గొన్నారు. 





Updated Date - 2021-07-24T05:33:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising