ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శంభో శంకర

ABN, First Publish Date - 2021-11-30T04:50:39+05:30

హర.. హర.. మహాదేవ.. శంభో.. శంకర.. నామస్మరణతో జిల్లాలోని శివాలయాలు మార్మోగాయి. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో భక్తులు శైవ క్షేత్రాలకు క్యూ కట్టారు.

విజయనగరం: రింగురోడ్డు ప్రాంతంలోని ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో దీపారాధన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భక్తులతో కిటకిటలాడిన శైవ క్షేత్రాలు 

 విజయనగరం (ఆంధ్రజ్యోతి), నవంబరు 29:

హర.. హర.. మహాదేవ.. శంభో.. శంకర.. నామస్మరణతో జిల్లాలోని శివాలయాలు మార్మోగాయి. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో భక్తులు శైవ క్షేత్రాలకు క్యూ కట్టారు. చిన్న ఆలయాల్లో సైతం బారులుతీరారు. రోజంతా స్వామి దర్శనాలు, పూజలు, అర్చనలు, అభిషేకాలు, ఉపవాస దీక్షలతో ఆధ్యాత్మిక శోభ కనిపించింది. ఉదయం 3గంటల నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం ఆలయాల ధ్వజస్తంభాల వద్ద మహిళలు అఖండ దీపారాధన చేపట్టారు. విజయనగరంలోని వీర రాజేశ్వర స్వామి ఆలయం (మూడు కోవెళ్లు), శివాలయం వీధిలోని ఉమారామలింగేశ్వర స్వామి ఆలయం, కొత్త అగ్రహారంలోని కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయాల్లో మహిళా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిన్మయ మిషన్‌ ఆధ్వర్యంలో రింగురోడ్డులోని ప్రైవేటు కళ్యాణ మండపంలో పార్వతీ పరమేశ్వరుల కల్యాణం జరిగింది. రాత్రి 8 గంటలకు అఖండదీపారాధన నిర్వహించారు. జ్ఞానసరస్వతి ఆలయంలో తులాభారం, సామూహిక అక్షరాభ్యాసాలు జరిగాయి. పార్వతీపురం, కొమరాడ, బొబ్బిలి, సాలూరు, ఎస్‌.కోటలోని పుణ్యగిరి ఆలయం, ధర్మవరంలోని సన్యాసేశ్వర ఆలయాల్లో కార్తీకశోభ ఉట్టిపడింది. 


Updated Date - 2021-11-30T04:50:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising