ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాఠశాలలు పరిశుభ్రంగా ఉండాలి

ABN, First Publish Date - 2021-04-17T06:03:42+05:30

పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచాలని డీఈవో నాగమణి ఆదేశించారు.

మాట్లాడుతున్న డీఈవో నాగమణి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  పిల్లలకు సంపూర్ణ పోషకాహారాన్ని అందించాలి 

  డీఈవో నాగమణి 

కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 16: పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచాలని డీఈవో నాగమణి ఆదేశించారు.  పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణ , మధ్యాహ్నా భోజన పథకం అమలుపై శుక్రవారం కలెక్టరేట్‌లో ఎంఈవో, హెచ్‌ఎంలు, సీఆర్‌పీలు, ఉపాధ్యాయలకు ఒక రోజు శిక్షణ ఇచ్చారు. కార్యక్రమానికి హాజరైన  డీఈవో నాగమణి మాట్లాడుతూ పాఠశాలల్లో మరుగుదొడ్ల సదుపాయం,  పారిశుధ్యం మెరుగుపరచడం ద్వారా పిల్లల హాజరుశాతాన్ని పెంచొచ్చన్నారు. బాలికల శాతం తగ్గిపోవడానికి మరుగుదొడ్ల కొరతే కారణమన్నారు.  సుప్రీం కోర్డు ఆదేశాల మేరకు జరిగిన ఒక సర్వేలో ఇది తేటతెల్లమైందని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకుని సమగ్ర శిక్ష కార్యక్రమాల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు  చెప్పారు. నాడు-నేడు మొదటి దశ కింద రూ.246 కోట్లతో  1014 పాఠశాలల్లో మరుగుదొడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. రెండో విడత పనులు మే నుంచి ప్రారంభమవుతాయని చెప్పారు. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో 10,874 మంది విద్యార్థులు చేరడం గొప్ప విషయమన్నారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంద న్నారు. డిప్యూటీ డీఈవో బ్రహ్మాజీ, ఏడీ అరుణజ్యోతి తదితరులు ఉన్నారు. 

 

 

Updated Date - 2021-04-17T06:03:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising