ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జేఈఈ అడ్వాన్స్డ్‌లో సత్తా

ABN, First Publish Date - 2021-10-17T05:42:02+05:30

జేఈఈ అడ్వాన్సడ్‌ పరీక్షలో జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటారు. అనేక మంది ఉత్తమ ర్యాంకులు సాధించారు. ఈనెల 3న పరీక్ష జరిగింది. జిల్లాకేంద్రంలోని అయాన్‌ డిజిటల్‌, లెండి, ఎంవీజీఆర్‌ కేంద్రాల్లోనూ పరీక్ష జరిగింది. మొయిన్స్‌ పరీక్షలు మూడు ధపాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

ప్రణీత్‌ను అభినందిస్తున్న తల్లిదండ్రులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉత్తమ ర్యాంకులు సాధించిన జిల్లా విద్యార్థులు

కలెక్టరేట్‌, అక్టోబరు 16: జేఈఈ అడ్వాన్సడ్‌ పరీక్షలో జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటారు. అనేక మంది ఉత్తమ ర్యాంకులు సాధించారు. ఈనెల 3న పరీక్ష జరిగింది. జిల్లాకేంద్రంలోని అయాన్‌ డిజిటల్‌, లెండి, ఎంవీజీఆర్‌ కేంద్రాల్లోనూ పరీక్ష జరిగింది. మొయిన్స్‌ పరీక్షలు మూడు ధపాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

ప్రణయ్‌కు 56వ ర్యాంకు

జిల్లా కేంద్రంలోని పైడిమాంబ కాలనీకి  చెందిన మిడతాన ప్రణయ్‌కు జేఈఈ అడ్వాన్సడ్‌ ఫలితాల్లో ఓపెన్‌ కేటగిరిలో 56వ ర్యాంకు వచ్చింది. ఓబీసీలో 3వ ర్యాంకు సాధించడం విశేషం. జేఈఈ మొయిన్స్‌లో 65వ ర్యాంకు, ఏపీ ఎంసెట్‌లో 7వ ర్యాంకు ,తెలంగాణ ఎంసెట్‌లో 7వ ర్యాంకు సాధించాడు. కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ కోర్సును ఐఐటీ ముంబయిలో చదవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రణయ్‌ చెప్పాడు. తండ్రి మిడతాన రామారావు గంట్యాడ మండలం లక్కిడాం జడ్పీ పాఠశాలలోనూ, తల్లి జ్యోతి రామవరం జడ్పీ పాఠశాలలో  ఉపాధ్యాయులుగా చేస్తున్నారు. 

ప్రణీత్‌కు 73వ ర్యాంకు 

జిల్లా కేంద్రానికే చెందిన కె.ప్రణీత్‌ జేఈఈ అడ్వాన్సడ్‌ ఫలితాల్లో 73వ ర్యాంకు సాధించారు. ఆయన తండ్రి కె.రాజకుమార్‌ నెల్లిమర్ల ఎంపీడీవోగా పనిచేస్తున్నారు. తల్లి పీవీ రాణి కొండవెలగాడ జెడ్పీ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలుగా విఽధులు నిర్వహిస్తున్నారు. కంప్యూటర్‌ ఇంజినీరు కావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రణీత్‌  చెప్పాడు.

ఆకాంక్షకు 274వ ర్యాంకు 

జిల్లా కేంద్రంలోని తూర్పుబలిజివీధికి చెందిన కనకల డిట్టూ ఆకాంక్షకు ఓపెన్‌లో 274, ఓబీసీ కేటగిరిలో 28వ ర్యాంకు వచ్చింది. ఆయన తండ్రి కనకల శేషుబాబు ఓ ప్రైవేటు కాలేజీకి జోనల్‌ ప్రిన్సిపాల్‌గా, తల్లి దుర్గాభవాని ఆర్‌అండ్‌బీలో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. తాను ఐఏఎస్‌ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆకాంక్ష చెప్పారు. 



Updated Date - 2021-10-17T05:42:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising