ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తహసీల్దారు అద్దె కారులో సారా రవాణా

ABN, First Publish Date - 2021-02-27T05:34:47+05:30

సారా రవాణాకు కొందరు వినూత్న మార్గాలను ఎంచుకుంటున్నారు. విజయనగరం జిల్లాలో ఏకంగా ఓ తహసీల్దారు అద్దె వాహనాన్ని వినియోగించుకున్నారు.

పట్టుబడిన నిందితుడు, సారా, కారుతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రామభద్రపురం, ఫిబ్రవరి 26: సారా రవాణాకు కొందరు వినూత్న మార్గాలను ఎంచుకుంటున్నారు. విజయనగరం జిల్లాలో ఏకంగా ఓ తహసీల్దారు అద్దె వాహనాన్ని వినియోగించుకున్నారు. కొద్దిరోజులుగా సారా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న ముగ్గురు వ్యక్తులు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో సిబ్బందికి చిక్కారు. ఇందుకు సంబంధించి బొబ్బిలి ఎస్‌ఈబీ సీఐ విజయ్‌కుమార్‌ అందిం చిన వివరాలిలా ఉన్నాయి. ఒడిశా నుంచి సారా రవాణా చేస్తున్నట్టు ముందస్తు సమాచారం మేరకు బలిజిపేట మండలం పెదపెంకి వద్ద గురువారం అర్ధరాత్రి ఎస్‌ఈబీ సిబ్బంది తనిఖీ చేస్తున్నారు. ఆ సమయంలో ఓ కారు రావడంతో ఆపడానికి ప్రయత్నించారు. మద్యం మత్తు లో ఉన్న డ్రైవర్‌ అతివేగంగా పోనిచ్చాడు. ఎలాగోలా కారును నిలిపివేసి సిబ్బంది తనిఖీ చేయగా పెద్దఎత్తున సారా పట్టుబడింది. కారులో ఉన్న డ్రైవర్‌ జానకి దుర్గాప్రసాద్‌తో పాటు వాసిరెడ్డి మురళి, సొండి సురేష్‌లను అరెస్ట్‌ చేశారు. విచారణలో కొమరాడ తహసీల్దారు ఎల్‌వీ ప్రసాద్‌ అద్దె కారుగా తేలింది. తహసీల్దారు పార్వతీపురంలో నివాసముంటున్నారు. ప్రతిరోజూ సాయంత్రం తహసీల్దారును దించి డ్రైవర్‌ కారు తీసుకెళ్లేవాడు. ఈ నేపథ్యంలో రాత్రి ఒడిశా నుంచి సారా రవాణాకు కారును వినియోగించేవాడు. దీనిపై తహసీల్దారు ఎల్‌వీ ప్రసాద్‌ వద్ద ప్రస్తావించగా అది అద్దెకారు అని.. సాయంత్రం తనను దించి డ్రైవర్‌ వెళ్లిపోయే వాడని చెప్పారు. ఈ ఘటనతో తనకు ఎటువంటి సంబంధం లేదని తెలిపారు.

 

 

Updated Date - 2021-02-27T05:34:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising