ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పుణ్యగిరి జాతర ఏర్పాట్లపై సమీక్ష

ABN, First Publish Date - 2021-03-04T05:24:01+05:30

శృంగవరపుకోట పుణ్యగిరి దేవాలయంలో శివరాత్రి జాతరకు వచ్చే ఆదాయం నుంచి పంచాయతీకి నిధులు కేటాయిం చేలా దేవదాయ శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులతో మాట్లాడుతానని ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు పేర్కొన్నారు.

అధికారులతో చర్చిస్తున్న ఎమ్మెల్యే కడుబండి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శృంగవరపుకోట, మార్చి 3 : శృంగవరపుకోట పుణ్యగిరి దేవాలయంలో శివరాత్రి జాతరకు వచ్చే ఆదాయం నుంచి పంచాయతీకి నిధులు కేటాయిం చేలా దేవదాయ శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులతో మాట్లాడుతానని ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు పేర్కొన్నారు. బుధవారం స్థానిక తహసీల్దార్‌ ఎల్‌.రామారావు ఆఽధ్వర్యంలో పుణ్యగిరి శివరాత్రి జాతర, ధర్మవరం సన్యాసేశ్వర స్వామి శివరాత్రి ఉత్సవ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. మహా శివరాత్రి పర్వ దినాన పుణ్యగిరి కొండకు వచ్చే భక్తులకు పంచాయతీ పరంగా విశాఖ-అరకు, విజయనగరం రోడ్డులో వచ్చే భక్తులకు పలు రకాల సదుపాయాలను పంచాయతీ కల్పిస్తుంది. పంచాయతీ పెడుతున్న ఈఖర్చుకు అడిట్‌ సమయంలో ఇబ్బందులు వస్తున్నాయని కార్యనిర్వాహక అధి కారిగా వ్యవహరిస్తున్న ఈవోపీఆర్డీ ఎంవీఏ శ్రీనివాసరావు సమీక్ష సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఈ నిధులను దేవదాయ శాఖ నుంచి ఇవ్వాలని కోరారు. ఇందుకు ఈ శాఖ అధికారుల నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో ఎమ్మెల్యే కల్పించుకోని ఈ శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి నిధులు ఇచ్చేలా ప్రయత్నిస్తానని తెలిపారు. వైసీపీ నాయకులు ఇందుకూరి రఘురాజు, వాకాడ రాంబాబు, దేవదాయ శాఖ అధికారులు శ్రీనివాస్‌, రమేష్‌, ఎస్‌.ఐ నీలకంఠం, తాగునీటి శాఖ అధికారి కిషోర్‌, విద్యుత్‌ శాఖ ఏఈ దేముడు ఉన్నారు. 


Updated Date - 2021-03-04T05:24:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising